Advertisement
Google Ads BL

ఫ్రెండ్స్ చెప్పారనే పెళ్లి చేసుకున్నాం: బన్నీ!


స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ తన భార్య స్నేహలతా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ బన్నీ మాత్రం తమది పెద్దలు కుదిర్చిన వివాహమే అని చెప్పుకొచ్చాడు. ఆయన తన బర్త్‌డే సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ, పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. స్నేహకి, తనకి అభిరుచులు దాదాపుగా సేమ్‌గా ఉంటాయని, దాంతో మీరిద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా అని నా స్నేహితులు అనేవారు. ఈ మాటలు ఇంట్లో వారికి తెలిసి, వెంటనే సంబంధం మాట్లాడేసి పెళ్లి చేశారు. ఇక ఎందుకోగానీ నాకు సినిమా రంగానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఎప్పుడు లేదు. నేను సినిమాలలో తలమునకలై ఉన్నాను. నాకు కాబోయే భార్య కూడా సినీరంగానికే చెందితే ఇక సినిమా తప్ప మరో లోకం చూడలేమని భావించేవాడిని, అందుకే సినిమా ఫ్యామిలీ అమ్మాయిని తప్ప వేరే వారిని చేసుకోవాలనుకున్నాను. స్నేహతో అలాగే నేను భావించిన విధంగానే పెళ్లి జరిగింది. ఇక స్నేహకి పెద్దగా సినిమాలంటే ఆసక్తిలేదు.. అని చెప్పుకొచ్చాడు. 

Advertisement
CJ Advs

ఇక స్నేహ తండ్రి తెలంగాణ రాజకీయాలలో నాడు క్రియాశీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో వార్త బన్నీగురించి షికారు చేస్తోంది. ఎన్టీఆర్‌ 'జైలవకుశ' సందర్భంగా చరణ్‌ ఫోన్‌ చేసి ఎన్టీఆర్‌ని మెచ్చుకున్నాడు. ఇక త్వరలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్‌లో నటించనున్నారు. ఇక మహేష్‌ 'భరత్‌ అనే నేను' వేడుకకి ఎన్టీఆర్‌ గెస్ట్‌గా వచ్చాడు. అదే రోజు రాత్రి ఎన్టీఆర్‌, చరణ్‌, మహేష్‌లు కలిసి ఓపార్టీలో పాల్గొని ఫొటోలకు ఫోజులిచ్చారు. మహేష్‌, చరణ్‌లు విదేశాలలో కూడా వెకేషన్స్‌లో దర్శనమిచ్చారు. ఇక ప్రభాస్‌ విషయం తెలిసిందే. ఆయన అజాత శత్రువు. ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్స్‌ మెయిన్‌ టెయిన్‌ చేస్తాడు. ఇక పవన్‌కి కూడా ఇగోలు లేవు. ఆయన ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీ ఓపెనింగ్‌కి హాజరై క్లాప్‌ కొట్టాడు. అయినా పవన్‌ ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు అప్రస్తుతం. ఇక మిగిలిన స్టార్స్‌లో బన్నీ ఒక్కడే ఎవరితో కలవకుండా, తన సొంత బ్రాండ్‌, ఇమేజ్‌, ఫ్యాన్స్‌లు ఏర్పరచుకునే పనిలో ఉన్నాడు. నేటి యంగ్‌ స్టార్స్‌ అందరూ కలిసి కనిపిస్తున్నా బన్నీ బయటి హీరోలతో కాదు కదా...! మెగా ఫ్యామిలీ హీరోలతో కూడా సఖ్యంగా ఉన్నట్లు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. 

Allu Arjun, Sneha Reddy Marriage Arranged, Not Love Marriage:

Allu Arjun Shares about His Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs