1998 అక్టోబర్‌లో 'హమ్ సాథ్ సాథ్ హై ' షూటింగ్‌ని ముగించుకుని, రాజస్థాన్ అడవుల నుంచి వచ్చే సమయంలో తోటి నటీనటులతో పాటు సల్మాన్‌ఖాన్ ఆయా ప్రాంతాలలోని పలు తెగల వారు దేవుడిలా చూసుకునే కృష్ణజింకను వేటాడి చంపిన కేసులో జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌కి ఐదేళ్లు జైలు శిక్ష, 10వేలు జరిమానా విధించింది. మిగిలిన జీపులోని టబు, సోనమ్, సోనాలి బింద్రే, సైఫ్‌అలీ ఖాన్ వంటి వారు సల్మాన్‌ని ప్రోత్సహించారని నిందుతులుగా పేర్కొన్నా కూడా సరైన సాక్ష్యాలు లేకపోయే సరికి కేవలం సల్మాన్‌కి మాత్రమే శిక్షపడింది. ఇక సల్మాన్ అరెస్ట్ అయి జైలులో రెండు రోజులు కూడా గడిపాడు. తర్వాత ఆయన తరపు న్యాయవాది బెయిల్ పిటీషన్ వేయడంతో సల్మాన్‌కి బెయిల్ లభించింది. ఇక సల్మాన్ కేసు నుండి బయట పడాలని కత్రినాకైఫ్ ముంబైలోని సుప్రసిద్ద వరసిద్ది వినాయక స్వామి గుడిలో పూజలు జరిపింది. ప్రీతిజింటా జైలుకి వెళ్లి సల్మాన్‌ని పలకరించింది. ఇక తాజాగా సల్మాన్ తనకు జైలు శిక్ష విధించిన తర్వాత అభిమానులు తనపై చూపుతున్న ప్రేమకు, ఆదరణకు కన్నీరు వచ్చాయని, థ్యాంక్స్ అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశాడు.