Advertisement
Google Ads BL

ప్రభాస్‌పై షాకింగ్‌ రూమర్స్‌కి చెక్‌..!


బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ పెళ్లి సంగతి ఏమోగానీ 'బాహుబలి'తో నేషనల్‌స్టార్‌గా మారిన ప్రభాస్‌ విషయంలో మాత్రం ఆయన పెళ్లి విషయంలో పలు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక నిజం చెప్పాలంటే సల్మాన్‌ తర్వాత మోస్ట్‌ డిజైరబుల్‌ బ్యాచ్‌లర్‌ ప్రభాస్‌ అనే చెప్పాలి. ఇక సల్మాన్‌ వయసు ఐదు పదులు దాటిపోవడంతో ఇప్పుడున్న నిజమైన బాచ్‌లర్‌గా ప్రభాస్‌ని చెప్పాలి. ఇక 'బిల్లా, మిర్చి, బాహుబలి' చిత్రాల తర్వాత ప్రభాస్‌, అనుష్కలు ప్రేమలో పడ్డారని, వారు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు షికారు చేశాయి. ఎట్టకేలకు వీటికి అనుష్క చెక్‌ చెప్పింది. ఇలాంటి రూమర్స్‌ ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అయినా ఈ వార్తలు ఆగటం లేదు. మరోవైపు యూట్యూబ్‌లలో పలు మీడియాలో మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు, మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె, నటి కొణిదెల నిహారికను ప్రభాస్‌ వివాహం చేసుకోనున్నాడని, దీనికి చిరంజీవి, కృష్ణంరాజులు కూడా ఓకే అన్నారని వార్తలు చాలా మందిని షాక్‌కి గురి చేశాయి. 

Advertisement
CJ Advs

ఇక ప్రభాస్‌కి అనుష్కతో ఎలా అయితే లింకు పెట్టారో 'ఒకమనసు' ద్వారా నిహారిక పరిచయమైన చిత్రం హీరో నాగశౌర్యకు కూడా నిహారికకు మధ్య లింక్‌పెట్టి వార్తలు వచ్చాయి. ఇక తాజాగా నిహారిక, ప్రభాస్‌ విషయంలో ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని, ఇందులో ఏమాత్రం నిజంలేదని జాతీయ మీడియా జీన్యూస్‌ తెలిపింది. ఈ వార్తలను చిరంజీవి ఖండించారని, ప్రస్తుతం నిహారిక నటిగా తనను తాను సెట్‌ చేసుకునే పనిలో ఉందని, మరోవైపు ప్రభాస్‌ కూడా 'సాహో'ని చేస్తూ, తదుపరి చిత్రాన్ని కృష్ణంరాజుకి చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి నిప్పులేనిదే పొగరాదని అంటారు. కానీ ఇప్పటి మీడియా మాత్రం నిప్పును తామే అంటించి, పొగలను కూడా వారే బయటకు వదులుతుండటం బాధాకరమనే చెప్పాలి.

Chiru About Prabhas and Niharika Marriage Rumours:

Megastar Chiru denies rumours of Prabhas marrying his niece Niharika Konidela
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs