Advertisement
Google Ads BL

భరత్ గారూ.. కామెడీ సంగతేంటి..?


ఈ మధ్యన భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ హీరోలే కామెడీ చేసేస్తున్నారు. కమెడియన్స్ ఉన్నప్పటికీ... హీరోలు కూడా కామెడీ యాంగిల్ చూపించేస్తున్నారు. అందులోను ఈ మధ్యన ప్రేక్షకులు ఎక్కువగా కామెడికే కనెక్ట్ అవుతున్నారు. సినిమాలో తగుపాళ్లలో కామెడీ లేకపోతే సినిమా మీద పెద్దగా ఆసక్తి క్రియేట్ అవ్వడం లేదు. అందుకే స్టార్ డైరెక్టర్స్ కూడా కామెడీకి పెద్ద పీట వేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా మరో పది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేయనుంది. ప్రస్తుతం రంగస్థలం రచ్చ నడుస్తున్న టైం లో ఇప్పుడందరూ మహేష్ బాబు భరత్ అనే నేను కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే కొరటాల తన సినిమాల్లో స్పెషల్ గా కామెడీ ట్రాక్ అనేది పెట్టాడు. మిర్చి సినిమాలో బ్రహ్మి కామెడీ వర్కౌట్ అయినప్పటికీ.. శ్రీమంతుడులో అలాంటి స్పెషల్ ట్రాకేమి పెట్టలేదు. కానీ సినిమాలో కొన్నిచోట్ల జోవియల్ సీన్స్ ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లోను సపరేట్ కామెడీ ట్రాక్ లేదు. మరి కొరటాల సినిమాల్లో కామెడీకి స్పెషల్ గా  ట్రాక్ లేకపోయినా... కథలోనే కామెడీని కలిపేసి అందరిని ఎంటర్టైన్ చెయ్యగల సత్తా కొరటాలకు ఉంది. మరి హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న కొరటాల శివ భరత్ అనే నేను సినిమాతోనూ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అయితే భరత్ లో కామెడీ ని కొరటాల లైట్ తీసుకున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది.  

ఎందుకంటే భరత్ అనే నేను టీజర్ లో గాని, ట్రైలర్ లో గాని ఎక్కడ కామెడీని చూపించలేదు. అందులోను రాజకీయాలంటే ఎక్కువ సీరియస్ నెస్ పండించాలి. అలాగే సీఎంగా మహేష్ ఎంతో గంభీరంగా కనబడాలి. మరి సీఎం కామెడీ చెయ్యడం కుదరదు కాబట్టి.. కొరటాల స్పెషల్ గా కామెడీ ట్రాక్ ని భరత్ లో పెట్టాడా... లేదంటే భరత్ అనే నేను సినిమా మొత్తం సీరియస్ నెస్ నిండిన కథగానే చూపించనున్నాడా... అనేది మాత్రం ఏప్రిల్ 20 నే తెలుస్తోంది. కాకపోతే మహేష్ - కైరాల మధ్యన ఏమన్నా కామెడీ పండిస్తాడేమో చూడాలి. ఎందుకంటే కైరా అద్వానీ యంగ్ సీఎం మహేష్ కి పిఎ గా చేస్తోంది.

Serious Discussion on Bharat Ane Nenu Comedy:

What About Comedy in Bharat Ane Nenu Movie?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs