Advertisement
Google Ads BL

వదినమ్మ ట్వీట్‌కి ముగ్దులైపోతున్న పవన్‌ ఫ్యాన్స్‌!


పవన్‌కళ్యాణ్‌ మాజీ శ్రీమతి, సినిమా నటిగా, మోడల్‌గా పేరు తెచ్చుకున్న రేణుదేశాయ్‌ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది. ఇక మరాఠీలో చిత్రాలకు దర్శకత్వం, నిర్మాతగా మారుతోంది. ఇక ఈమె పవన్‌ నుంచి విడిపోయినా కూడా పవన్‌ గురించి ఎంతో ఎమోషనల్‌ ట్వీట్స్‌ చేస్తూ ఉంటుంది. ఏ ఇంటర్వ్యూలో అయినా పవన్‌ పేరెత్తకుండా ఉండదు. అందునా ఇంటర్వ్యూ చేసేవారు కూడా ఆమెని పవన్‌కి సంబంధించిన ప్రశ్నలతోనే ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. ఇటీవల ఆమె తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు మరో మగతోడు కావాలని అనిపించింది.. అని చెప్పడంతో పవన్‌ ఫ్యాన్స్‌ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అలా ఆమెని రెండో వివాహం చేసుకునేందుకు ఎవరైనా ముందుకు వస్తే నరికి పోగులు పెడతామని బెదిరించారు. ఇక విషయానికి వస్తే తాజాగా పవన్‌-రేణులకు పుట్టిన పెద్దబ్బాయి అకీరా నందన్‌ పుట్టినరోజు వేడుక జరిగింది. అకీరా బర్త్‌డే సందర్భంగా పవన్‌ ఫ్యాన్స్‌ అకీరాని అభినందలు, శుభాకాంక్షలతో ముంచెత్తారు. 

Advertisement
CJ Advs

ఇక మెగా కాంపౌండ్‌ హీరోలైన వరుణ్‌తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లు కూడా అకీరాకి శుభాకాంక్షలు తెలిపారు. అకీరా 14 వ ఏట అడుగు పెట్టాడు. . దీనిపై రేణుదేశాయ్‌ తన ఫేస్‌బుక్‌లో స్పందించింది. మీరందరూ నా కుమారుడిపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అకీరాకి 14ఏళ్లు వచ్చాయి కాబట్టి అతను ఇంకా బేబీ బోయ్‌ కాదు. మరికొన్ని రోజుల్లో అతను బాబుకిందకి రాడు. అయితే జన్మనిచ్చిన తల్లిగా అతను నాకెప్పుడు బేబీబోయే. జన్మనిచ్చిన తల్లిగా అతడిని పిల్లవాడిగానే చూస్తాను. తల్లి, తండ్రి తరపున గొప్ప వ్యక్తులున్న కుటుంబాలలో అకీరా జన్మించాడు. మీరు రాత్రి నుంచి చెబుతున్న బర్త్‌డే విషెస్ కి అకీరా తల్లిగా ఎంతో బావోద్వేగం చెందాను. మీ అందరికీ మా లిటిల్‌ బర్త్‌డే బాయ్‌ తరపున థాంక్యూ. ఈ పుట్టిన రోజు సందర్భంగా అకీరా తాను ఇష్టపడే రంగంలో రాణించేందుకు తల్లిగా నేను నా సహకారం అందిస్తాను. అతను కోరుకున్న రంగంలో పైకి రావాలని ఆశిస్తున్నాను.. అంటూ ఎమోషన్‌ మెసేజ్‌ని పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది..! 

Pawan Kalyan Fans happy with Renu Desai Tweets:

Renu Desai Tweets Hulchal in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs