Advertisement
Google Ads BL

'రంగస్థలం'పై ఆగని ప్రశంసల వర్షం!


రామ్‌చరణ్‌ హీరోగా, సమంత, జగపతిబాబు, ఆదిపినిశెట్టి, అనసూయలు నటించిన 'రంగస్థలం' చిత్రం అద్భుతమైన కలెక్షన్లనే కాదు.. ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. ఈచిత్రం చూసిన మహేష్‌బాబు, రాజమౌళి,రాంగోపాల్‌వర్మ తదితరులు యూనిట్‌ని, సుకుమార్‌తో పాటు నటీనటులందరిని విపరీతమైన పొగడ్తల వర్షంలో ముంచెత్తున్నారు. రాజమౌళి వంటివారి నుంచి మహేష్‌, వర్మ వంటి వారు పొగడటం వల్ల ఈ చిత్రానికి మరింత ప్రమోషన్‌ లభించి, రెండో వారంలో కూడా స్టడీ కలెక్షన్లతో నాన్‌ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ, రంగస్థలంలో ఎన్నోమంచి విషయాలున్నాయి. చిట్టిబాబు పాత్రను సుకుమార్‌ మలిచిన తీరు, రామ్‌చరణ్‌ ఆ పాత్రలో ఒదిగి పోయిన విధానం అద్భుతం. చరణ్‌ నటన చూడటం ఓ ట్రీట్‌లాంటిది. ఈ సినిమాలో చరణ్‌కి పోటీగా జగపతిబాబు నటించారు. స్లోగా ఆయన చెప్పే డైలాగ్స్‌ తీరు అద్భుతంగా ఉంది. టెర్రిఫిక్‌ బాక్సాఫీస్‌ పర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించినందుకు మైత్రిమూవీమేకర్స్‌, సుకుమార్‌, యూనిట్‌ అంతటికి శుభాకాంక్షలు అందించారు. 

Advertisement
CJ Advs

ఇక రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ, 'రంగస్థలం' ఓ బుల్లెట్‌ వంటి అచీవ్‌మెంట్‌. రామ్‌చరణ్‌ 'మైండ్‌బ్లోయింగ్‌ ఫెంటాస్టిక్‌' అని పొగడ్తల వర్షం కురిపించాడు. 'హేయ్‌ సుకుమార్‌ నీకు మూడు ధన్యవాదాలు.. మూడు ముద్దులు అని కితాబిచ్చాడు. ఇక ఈ చిత్రంపై మరోసారి సూపర్‌స్టార్‌ మహేష్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రంతో మైత్రీమూవీమేకర్స్‌ సంస్థ మరోసారి తన సత్తా చాటింది. రామ్‌చరణ్‌, సమంతలకు ఇది నిజంగా కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌. సినిమా అద్భుతంగా ఉంది. మొత్తం టీంకి శుభాకాంక్షలు. దర్శకుడు సుకుమార్‌ 'ట్రూలీ ఏ మాస్టర్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌'. ఇక అన్ని విషయాలలోను 'నువ్వు రాక్‌స్టార్‌వి' అని దేవిశ్రీ ప్రసాద్‌ని పొగుడుతూ, రత్నవేల్‌ సినిమాటోగ్రఫీని ప్రత్యేకంగా అభినందించాడు. ఇక జక్కన్న, వర్మ, మహేష్‌ల కామెంట్స్‌తో సినిమా చూసినవారే మరలా చూసే రిపీట్‌ ఆడియన్స్‌తో పాటు ఇంకా ఈ సినిమాని చూడని వారు కూడా వీరి ప్రశంసలు చిత్రాన్నిచూసేలా చేస్తాయనడంలో అనుమానం లేదు...!

Praises on Rangasthalam.. Continues:

RGV Praises Ram Charan Rangasthalam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs