Advertisement
Google Ads BL

చరణ్, మహేష్, ఎన్టీఆర్.. పక్కపక్కనే..!


శనివారం సాయంత్రం ఒకే స్టేజ్ మీద ఇద్దరు స్టార్ హీరోలు. అలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవని అభిమానుల ఆనందకేళి. నిన్నరాత్రి జరిగిన భరత్ అనే నేను బహిరంగ సభలో మహేష్ బాబు , కొరటాల శివ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఘట్టమనేని, నందమూరి అభిమానులతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. అలా ఇద్దరు స్టార్ హీరోలను స్టేజ్ మీద చూస్తుంటే కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు చూసే ప్రతి ఒక్కరికి కన్నుల పండుగగానే ఉంటుంది. అయితే భరత్ కోసం మరో స్టార్ హీరో వస్తాడని కూడా అన్నారు. అతనెవరో కాదు. మహేష్ దోస్త్ రామ్ చరణ్.

Advertisement
CJ Advs

కానీ చివరి నిమిషంలో రామ్ చరణ్ భరత్ ఫంక్షన్ కి రాలేకపోయాడు. ఇక ఆ స్టేజ్ మీద రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లు నించుంటే మెగా, నందమూరి, ఘట్టమనేని అభిమానుల రచ్చ ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదు. ఇక మరి రామ్ చరణ్ భరత్ బహిరంగ సభకి రాకపోతేనేమి.... భరత్ అనే నేను నిర్మాత డి వి వి దానయ్య బహిరంగ సభ పూర్తి కాగానే ఒక స్టార్ హోటల్ లో ఒక పెద్ద పార్టీ ప్లాన్ చెయ్యగా.. అక్కడికి రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ కలిసి ఎంజాయ్ చేశారు. ఇక ఎన్టీఆర్ స్టేజ్ మీద మహేష్ బాబుకి విషెస్ తెలుపగా.. రామ్ చరణ్ మాత్రం పార్టీలో మహేష్ కి భరత్ అనే నేను సినిమా హిట్ కావాలని విషెస్ తెలియజేశాడు.

ఇక ఆ పార్టీలో ముగ్గురు స్టార్ హీరోలతో పాటు కొరటాల, దానయ్యలు కలిసి దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్, మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి అలా ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే అబ్బబ్బ ఏం ఉందిరా అనిపిస్తుంది. మరి ముగ్గురు స్టార్ హీరోలు స్టేజ్ మీద కనబడకపోతేనేమి...ఇలా పార్టీలో కనబడినా చాలు... ముగ్గురు హీరోల ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. ఇకపోతే  చరణ్, ఎన్టీఆర్ లు కలిసి రాజమౌళి మల్టీస్టారర్ లో కలిసి నటిస్తున్నారు. ఇక భరత్ అనే నేను బహిరంగ సభలో ఇక నుండి ఒక హీరో ఫంక్షన్ కి మరో హీరో వస్తాడని మహేష్ బాబు కూడా హామీ ఇచ్చేశాడు. అలాగే మహేష్ బాబు అందరి అభిమానులను ఉద్దేశించి... మేమంతా ఒకటే.. అలాగే మీరు కూడా బాగుండాలి కాదు ఇంకా బాగుండాలి అని అభిమానులందరూ కలిసుండాలని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు.

Mahesh Babu, Jr NTR, Ram Charan in single frame:

Celebrate Time For Mahesh, NTR, Charan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs