Advertisement
Google Ads BL

సూర్య డైలాగ్ ఇంపాక్ట్ అదిరింది..!


అల్లు అర్జున్ - వక్కంతం వంశి కాంబోలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' విడుదల మే 4 న. కానీ ఎప్పటినుండో ఈ సినిమాపై అంచనాలు పెంచడానికి బన్నీ అండ్ కో కొత్తగా ట్రై చేస్తూనే ఉంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా ఇంకా ఆ అంచనాలు పెంచేందుకు నా పేరు సూర్య టీమ్ ప్రయత్నిస్తుంది. అల్లు అర్జున్ గత చిత్రం డీజే సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కుమ్ముడు మాత్రం మాములుగా లేదు... అది అల్లు అర్జున్ కున్న క్రేజ్. మరి అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 న మెగా ఫ్యాన్స్ కి మంచి  ట్రీట్ ఇస్తున్నాడు.

Advertisement
CJ Advs

అను ఇమ్మాన్యుయేల్ తో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్ ఒకపక్క ఆర్మీ ఆఫీసర్ గా అలాగే రొమాంటిక్ పర్సన్ గా కూడా అదరగొడుతున్నాడు. ఇద్దరమ్మాయిలు మూవీలోలాగా అల్లు అర్జున్ గిటార్ పట్టుకుని ఎంతో స్టైలిష్ గా నడిచొస్తున్న  స్టైల్ పిక్ ని నిన్న శనివారం విడుదల చేశారు. ఆ పిక్ లో నిజంగానే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ఎందుకయ్యాడో.. ఆ పిక్ లోనే తెలుస్తుంది. ఇక పుట్టినరోజు సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ అంటూ అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. పబ్బులో రౌడీ మూకను బ్యాండ్ వాయిస్తూ ఉండగా తన్నులు తిన్నవాడు.... అల్లు అర్జున్ ని ఉద్దేశించి 'రేయ్ సౌత్ ఇండియాకా సాలా అంటే దానికి అల్లు అర్జున్ .... సౌత్ ఇండియా... నార్త్ ఇండియా.... ఈస్ట్..... వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా' అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఇంపాక్ట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది.

మరి ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ చాలా అంటే చాలా పవర్ ఫుల్ గా ఈ సినిమాలో కనిపిస్తాడనేది ఈ డైలాగ్ ఇంపాక్ట్ ద్వారా స్పష్టత వచ్చేసింది. ఇక వైజాగ్ లో నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ఇక అల్లు అర్జున్ తో పాటు సీనియర్ హీరో అర్జున్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఆ కీ రోల్ కూడా అల్లు అర్జున్ కి ఫాదర్ పాత్ర అనే టాక్ వినబడుతుంది.

CLICK HERE FOR NPS DIALOGUE TEASER

Allu Arjun Naa Peru Surya Dialogue Impact:

NPS Dialogue Teaser: Packs an Impact  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs