Advertisement
Google Ads BL

రాజమౌళి సినిమాలో చరణ్, ఎన్టీఆర్ పాత్రలివే!


టెంపర్ దగ్గర నుండి హిట్స్ కొడుతున్న స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ తరహా చిత్రంలో నటిస్తున్నాడు. మరోపక్క ధృవ, రంగస్థలం హిట్స్ తో చెలరేగిపోతున్న చరణ్ కూడా బోయపాటి సినిమాలో మాస్ యాంగిల్ లో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి రాజమౌళి మల్టీస్టారర్ సినిమాలో కలిసి కనబడబోతున్నారు. మరి రాజమౌళి కేవలం #RRR  అనే మోషన్ పోస్టర్ ద్వారానే సినిమాపై పిచ్చ అంచనాలు పెంచేశాడు. మరి రాజమౌళి గారు #RRR సినిమా కథ మాకు చెప్పలేదంటూ అటు ఎన్టీఆర్ ఇటు చరణ్ లు తెలివిగా తప్పించుకున్నారు. కానీ ఎన్టీఆర్ అండ్ చరణ్ లు ఈ సినిమాలో క్రీడాకారులుగా కనబడబోతున్నారనే టాక్ సినిమా అనుకున్నప్పటి నుండి నడుస్తోనే ఉంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు #RRR సినిమాలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు ఎలా కనబడబోతున్నారనేది తెలిసిపోయింది. రాజమౌళి ఈ మల్టీస్టారర్ ని  స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో తీస్తున్నారు అనేది నిజమేనట. అయితే ఎన్టీఆర్,  రామ్ చరణ్ లు మాత్రం ఈ సినిమాలో ఒకరితో ఒకరు పోటీ పడే క్యారెక్టర్లు కాదని తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్ ను హార్స్ రైడర్ గా చూపించబోతుంటే.. ఎన్టీఆర్ ను బాక్సర్ అవతారంలో చూపిస్తాడట. అందుకే అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ లు రాజమౌళి సినిమా కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారట.

మరి జై లవ కుశ తర్వాత ఎన్టీఆర్ లావుగా తయారై ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం కండలు కరిగించేస్తూ జిమ్ లో తెగ కష్టపడుతున్నాడని అందరూ అనుకుంటుంటే... కాదు కాదు రాజమౌళి మల్టీస్టారర్ కోసమే ఎన్టీఆర్ కండలు కరిగిస్తున్నాడని... ఇదే నిజమంటూ నిన్నటినుండి సోషల్ మీడియా లో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఎన్టీఆర్ బాక్సర్ గా రాజమౌళి సినిమాలో కుమ్మేస్తే... రామ్ చరణ్ గుర్రపు స్వారీ లో ఇరగదీస్తాడట. ఇప్పటికే రామ్ చరణ్ గుర్రపు స్వారీ ఎలా చేస్తాడో అనేది రాజమౌళి గారి మగధీర సినిమాలో చూసేసాం. 

Ram Charan and NTR Roles in Rajamouli's Multi-starer Movie :

<h3 class="text-center"><span style="font-weight: normal;">Jr NTR preparing his physique for Rajamouli film</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs