Advertisement
Google Ads BL

కోన.. ఏం మాట్లాడుతున్నావు..!


మన దేశంలో శాస్త్రవేత్తలు, మంచి మేధావుల కంటే సినిమా వారి మాటలకు విలువ పెరిగిపోయింది. అది కూడా సందర్భానుసారం కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే మిడిమిడి జ్ఞానం ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. సినిమా వారేమైనా దేవుళ్లా? పై నుంచి ప్రత్యేకంగా దిగి వచ్చారా? ఇక వారికి భజన చేయడంలో మన రచయితలు, దర్శకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పవన్‌ని కత్తి మహేష్‌ విమర్శిస్తే పవన్‌ దేవుడు అన్నట్లుగా సినిమా వారు మాట్లాడుతారు. డ్రగ్స్‌ కేసులో విచారణ జరుగుతుంటే మేమే కనిపించామా? అని ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తారు. ఇక సుచీలీక్స్‌ నుంచి శ్రీరెడ్డి లీక్స్‌ వరకు ఈ సినిమా పెద్దల అసలు స్వరూపం బయటపడుతోంది. ఇక తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ వంటి వారు విమర్శలకు అతీతులుగా భావించినట్లు, బాలీవుడ్‌లో సల్మాన్‌కి ఏమైనా జరిగితే మాత్రం బాలీవుడ్‌ మొత్తం బాధతో కన్నీరు పెట్టుకుంటుంది. ఆయనను జైలుకి పంపితే నిర్మాతలకు ఇన్ని కోట్లు నష్టం.. అన్ని కోట్లు నష్టం అని నంగనాచి కబుర్లు చెబుతూ ఉంటారు. ఆయనకు అంత కఠిన శిక్ష వేయడం తప్పు అంటారు. 

Advertisement
CJ Advs

ఇక 'మామ్‌'తో బాలీవుడ్‌ సినిమాలకు కూడా కథలు అందిస్తున్న రచయిత, తెలుగు సినిమా పెద్ద మనిషి కోనవెంకట్‌కి మాత్రం సల్మాన్‌ ఆవేదన బాగా అర్ధమవుతోందట. జంతువులను చంపినందుకు సల్మాన్‌కి అంత కఠినశిక్ష వేయడం సరికాదు. ముందు జంతువుల ప్రాణాలను కాదు.. మనషులు ప్రాణాలు కాపాడండి అని కోన స్పందించాడు. మరి ఇదే సల్మాన్‌ గట్టి సాక్ష్యాలు ఉన్న, ఏకంగా ఓ పోలీసే ప్రత్యక్ష సాక్షి అయిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో పలువురి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన సల్మాన్‌ ఆ కేసు నుంచి తప్పించుకోవడంతో మన దేశంలో చట్టాలు బలవంతులకు ఒక విధంగా, బలహీనుల పట్ల మరో విధంగా ప్రవర్తిస్తాయని చెబుతూనే ఉంది. పవన్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఆయనను ఖండించకూడదు. బాలయ్య ఇంట్లో కాల్పులు జరిపినా బాలయ్య మానవాతీతుడు. ఇలా ఉంది కోన వంటి పెద్దల వ్యవహారం, దేవుడు హిట్‌ అండ్‌ రన్‌ కేసుతో పాటు కృష్ణ జింక కేసు విషయంలో రెండింటికి కలిపి ఐదేళ్ల శిక్ష విధించడం సమంజసమే. ఇక సల్మాన్‌ అరెస్ట్‌ గురించి పాక్‌ మాట్లాడుతున్న వంకర బుద్ది తరహాలోనే మన సినీ పెద్దలైన కోన వెంకట్‌ వంటి వారు స్పందించడం సరికాదు. దీనిపై నెటిజన్లు కూడా కోనపై మండిపడుతున్నారు. వేటాడుకోదలుచుకుంటే దానికి మా దేశంలో వీలుకాదు. కావాలంటే విదేశాలకు వెళ్లి చేసుకోండి. ఒకసారి వన్యప్రాణి చట్టం గురించి గూగుల్‌లో చూసుకో... నిజమైన మనుషులు ఎవ్వరూ తమ ఆనందం కోసం జీవులను వేటాడరు.. అని గట్టిగా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఏం... సల్మాన్‌ అయినంత మాత్రాన ఆయనకేమైనా కొమ్ములు వచ్చాయా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

kona venkat supports salman khan :

Kona Venkat Trolled for Supporting Salman Khan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs