Advertisement
Google Ads BL

సమంత ట్రెండ్ క్రియేట్ చేసిందిగా..!


సాధారణంగా పెళ్లి చేసుకున్నాక హీరోయిన్స్ ని అంగీకరించరు జనాలు. దీంతో వాళ్లు పెళ్లి చేసుకున్న చేసుకోలేదని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోయిన్స్ కి క్రేజ్ ఉండాలంటే కచ్చితంగా వారు పెళ్లి చేసుకోకుండా కొంత కాలం ఆగాల్సిందే. ఇది ఒకప్పుడు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. ఇకపై ఇలాంటివన్నీ మర్చిపోవచ్చేమో అనిపిస్తుంది.

Advertisement
CJ Advs

లేటెస్ట్ గా సమంత రంగస్థలంలో యాక్ట్ చేయడమే కాకుండా హిట్ కొట్టేసింది. ఇందులో సమంత యాక్టింగ్ కూడా తన గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో బాగా చేసి అందరిని మెప్పించింది. ఇక తమిళనాడులో రిలీజ్ అయిన నాచియార్ అనే సినిమాలో జ్యోతిక పోలీస్ ఆఫీసర్ గా చేసింది. ఈ సినిమాతో జ్యోతిక నటించి మెప్పించడమే కాదు.. సక్సెస్ కూడా సాధించింది.

అలానే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయినా సక్సెస్ సినిమాల్లో చేయడమే కాకుండా వరసబెట్టి సినిమాలు చేస్తుంది. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నార్త్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుండో కొనసాగుతోంది. పెళ్లి ఐన తర్వాత కూడా చాలా మంది హీరోయిన్స్ సినిమా చేయడం మానలేదు. ఐష్, కరీనా,  అనుష్క శర్మ..రాణీ ముఖర్జీ...రాధిక ఆప్టే..ఇలా చాలా మందే ఉన్నారు. ఇదంతా చూస్తుంటే.. పెళ్లయిన హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ ను ఇక మర్చిపోవాల్సిన రోజులు వచ్చినట్లుగా అనిపించడం లేదూ!

Samantha Creates new Trend in Tollywood:

Samantha Sings more Films After Wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs