Advertisement
Google Ads BL

మెగాస్టార్‌ అంచనానే నిజమైంది!


మెగాస్టార్‌ చిరంజీవి ఒక్క రోజులో మెగాస్టార్‌ అయిపోలేదు. విలన్‌ నుంచి చిన్న చిన్న పాత్రలు, సుప్రీం హీరో, తర్వాత మెగాస్టార్‌ ఇలా ఆయన ఈ స్థితి వెనుక ఎన్నోఏళ్ల శ్రమ ఉంది. కొందరు చిరంజీవి కేవలం అల్లురామలింగయ్య అల్లుడు కావడం వల్లనే అల్లుకి ఉన్న పరిచయాలు, అల్లు రామలింగయ్య అనంతరం అల్లుఅరవింద్‌ సలహాలతోనే చిరు ఈ స్థాయికి వచ్చాడని వాదిస్తారు. కానీ చిరంజీవి అల్లురామలింగయ్య అల్లుడు కాకముందు నుంచే ఆయనలో ఎదిగే కసి, కృషి ఆయన నటించిన చిత్రాలలో కనిపించేవి. ఇక ఆయన కథ విషయంలో జడ్జిమెంట్‌ 90శాతం పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని అందరు ఒప్పుకుంటారు. అది ఇప్పుడు తన కుమారుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన 'రంగస్థలం' ద్వారా మరోసారి ప్రూవ్‌ అయింది. ఈ చిత్రం మొదట్లో ఇలాంటి సబ్జెక్ట్‌ని చేయవద్దని, సూట్‌ కాదని చిరంజీవి చరణ్‌కి సలహా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. 

Advertisement
CJ Advs

కానీ ఫైనల్‌ అవుట్‌పుట్‌ తర్వాత ఈ చిత్రం చూసిన చిరంజీవి ఇందులోంచి ఒక్క సీన్‌ కూడా తీసేయాల్సిన పని లేదని, సినిమాను ఉన్నది ఉన్నట్లుగా ఉంచినా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుందని సలహా ఇచ్చాడు. దానినే యూనిట్‌ నమ్మింది. ఇక ఈ చిత్రం చివరలో 'ఓరయ్యో' అనే ఎమోషనల్‌ సాంగ్‌ వస్తుంది. సినిమా నిడివి పెరగడంతో ఈ పాటను తీసివేద్దామని నిర్మాతలు దాదాపు పూర్తిగా ఒక అభిప్రాయానికి వచ్చి ఆ పాటను తీసివేద్దామని చరణ్‌, సుకుమార్‌లతో అన్నారట. దాంతో అందరం కలిసి చిరంజీవి గారి వద్దకు వెళ్దాం, ఆయన నిర్ణయమే ఫైనల్‌ డెసిషన్‌ అనుకుని నిర్మాతలు, చరణ్‌, సుకుమార్‌లు చిరంజీవిని కలవగా, ఆ పాటను తీయవద్దని ఆ పాట ఖచ్చితంగా అందరికీ కనెక్ట్‌ అవుతుంది. ఇక ఆ పాటకు ముందు వచ్చే సీన్స్‌, తర్వాత వచ్చే సీన్స్‌ని కూడా తీయవద్దు. అంతగా అయితే కామెడీ సీన్స్‌ని తీసి వేయండి అని చెప్పారట. ఆయన చెప్పినట్లుగా ఇప్పుడు అదే పాట ఆ సీన్స్‌ సినిమాకి బాగా హెల్ప్‌ అయ్యాయి.

Chiranjeevi Decision helps Rangasthalam grand Success:

Chiranjeevi is the REASON behind for Rangasthalam RUNTIME
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs