Advertisement
Google Ads BL

'క్షణం' డైరెక్టర్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్!


అడవి శేష్ కథ అందించి హీరోగా నటించిన  క్షణం సినిమా పివిపి నిర్మాణంలో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకు బోలెడన్ని లాభాలు వచ్చాయి. సినిమాకి దాదాపుగా ఐదారు కోట్ల లాభాలు నిర్మాతలు వెనకేసుకున్నారు. ఈ సినిమాని దర్శకుడు రవికాంత్ పెరెపు ఎంతో థ్రిల్లింగ్ గా క్షణంని మలిచాడు. ఆదా శర్మ, అడవి శేష్, అనసూయ పెరఫార్మెన్స్ లతో క్షణం సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ప్రస్తుతం రవికాంత్ పెరెపు సిద్ధు జొన్నలగడ్డ - సీరత్ కపూర్ ల జంటగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఇక రవికాంత్ పెరెపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని హీరో రానా దగ్గుబాటి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కథ రానాకీ నచ్చడంతో తానే స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇకపోతే  రవికాంత్ పెరెపు మరో కథని సెట్ చేసుకున్నాడట. ఆ కథ సూపర్బ్ గా ఉండడంతో.. ఆ కథను తన నిర్మాత రానాకి వినిపించగా.. రానా ఆ కథ అల్లు అర్జున్ కి సరిగ్గా సరిపోతుందని.. ఈ కథని అల్లు అర్జున్ కి వినిపించమని రవికాంత్ పెరెపు చెప్పడంతో  రవికాంత్ పెరెపు రానాకీ అల్లు అర్జున్ కి కలిపి కథని వినిపించగా అల్లు అర్జున్ కూడా ఈ కథకి బాగా కనెక్ట్ అయ్యాడనే టాక్ వినవస్తుంది.

రవికాంత్ పెరెపుతో సినిమా చేసే ఆలోచనలో బన్నీ ఉన్నట్లుగా  తెలుస్తుంది. ఎలాగూ వక్కంతం నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో కమిట్ అవ్వలేదు.  రవికాంత్ పెరెపు చెప్పిన కథ డిఫరెంట్ సబ్జెక్ట్ కావడంతో.. ఈ చిత్రంపై అల్లు అర్జున్ మక్కువ చూపుతున్నాడని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు సాధ్యమైతే.. ఈ సినిమాని కూడా  తానే నిర్మిస్తానని చెప్పాడట రానా దగ్గుబాటి.  అలాగే  రవికాంత్ ని కంప్లీట్ స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేయాల్సిందిగా సూచించారట రానా అండ్ అల్లు అర్జున్ లు. మరి అల్లు అర్జున్ ఒక్క క్షణం డైరెక్టర్ వి ఐ ఆనంద్ తో కూడా కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడనే ప్రచారం జరిగింది.

Allu arjun, Kshanam director to team up?:

Allu Arjun to collaborate with Kshanam director soon?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs