Advertisement
Google Ads BL

ఈ సింగర్.. శ్రీరెడ్డిని ఏం చేశాడు!


సుచీలీక్స్‌ తరహాలనే శ్రీరెడ్డి లీక్స్‌ కూడా టాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. శ్రీరెడ్డి తాజాగా శేఖర్‌ కమ్ములను గురించి కామెంట్స్‌ పెట్టడం, దానిపై శేఖర్‌ కమ్ముల సీరియస్‌గా రియాక్ట్‌ అయి చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. దాంతో శ్రీరెడ్డి కూడా నేను నా బాధలను చెప్పుకుంటూ ఉంటే మధ్యలో ఎవరెవ్వరో వచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారని, శేఖర్‌ కమ్ములది తప్పు లేకపోతే ఆయన ఉలిక్కిపడాల్సిన అవసరం ఏముంది? నేను కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాను. పోరాడటానికి డబ్బులు కాదు.. గుండె ధైర్యం చాలని పోస్ట్‌ పెట్దింది. ఇక తాజాగా ఆమె తాను శేఖర్‌ కమ్ములని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, తాను శేఖర్‌ సూరి అనే దర్శకునితో 'అరవింద్‌-2'లో యాక్ట్‌ చేశానని మాట మార్చింది. నిజానికి చెప్పాలంటే శేఖర్‌ కమ్ముల కంటే ఏ అలవాటు లేని వ్యక్తిగా శేఖర్‌ సూరికి పేరుంది. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా తాను ఓ నటికి కథను చెప్పడానికి గెస్ట్‌హౌస్‌కి వెళ్లితే మీ యూనిట్‌ అందరు నాతో సెక్స్‌ చేశారు? మీరు చేయరా? అని ప్రశ్నించి అవహేళన చేసిందని, దాంతో పక్కవారితో సెక్స్‌ చేసిన వారితో నేను సెక్స్‌ చేయను అని గట్టిగా చెప్పానని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా శ్రీరెడ్డి నేచురల్‌ హీరో అంటూ మరో హీరో వైపు దృష్టి మరల్చి అతడిని కూడా ఇందులోకి లాగే ప్రయత్నం చేసింది. నీవు స్క్రీన్‌ మీదనే కాదు.. నిజ జీవితంలో కూడా నేచులర్‌గా నటిస్తావు. అలాగే కనిపిస్తావు.

Advertisement
CJ Advs

కానీ అది ముసుగు మాత్రమే. జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకుంటావు. అదంతా జనాలలో సానుభూతిని కలిగించేందుకే. నీకంటే పెద్ద హీరోలే బెస్ట్‌. వాళ్లకు వాళ్ల తండ్రులు, తాతల అండ ఉన్నప్పటికీ ఎంతో నిజాయితీగా, సిన్సియర్‌గా ఉంటారు. చరణ్‌, మహేష్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల నుంచి నీవు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చిన్న దర్శకులను, కొత్త దర్శకులను నీవు అవమానిస్తావు. ఇటీవలే నీకు కొడుకు పుట్టాడు.. అంటూ నానా రచ్చచేసింది. ఇక తాజాగా ఆమె ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ అయిన శ్రీరామచంద్ర తనతో వాట్సాప్‌లో అసభ్యంగా చాట్‌ చేశాడని చెప్పి, వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను పెట్టింది. ఇందులో నిజానికి పూర్తి చాట్‌ లేదు. దానిని ఎడిట్‌ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నీపేరు నుంచి శ్రీరామా అనే పదాన్ని తీసివేయ్‌ నీకు అది సూట్‌ కాదు అంటోంది. కానీ ఆ స్క్రీన్‌ షాట్స్‌లో పూర్తి చాట్‌ హిస్టరీ లేదు. ఈ చాట్‌ ఇద్దరికి సంతోషంగా, ఇష్ట పూర్వకంగానే జరిగినట్లు కనిపిస్తోంది. శ్రీరామచంద్ర సరదాగా చేసిన వ్యాఖ్యలకు శ్రీరెడ్డి సీరియస్‌గా రియాక్ట్‌ ఆయినట్లు లేదు. శ్రీరెడ్డి కూడా అతని చాట్‌కి సరదాగా, ఇష్ట పూర్వకంగానే రిప్లైలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ శ్రీరెడ్డి ఉదంతం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సివుంది....!

Sri Reddy shames singer Sreeram Chandra:

Why Should Sri Reddy Poke Sreerama Chandra?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs