Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ ని మహానటి కాపాడాలి..!


నేను శైలజతో సైలెంట్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కీర్తి సురేష్ తర్వాత వెంటనే నేను లోకల్ తో హిట్ అందుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి, మహానటిలో సావిత్రి పాత్రతో అమ్మడు టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరైంది అని అనుకున్నారు. అందులో మహేష్ తో వచ్చిన ఆఫర్ ని డేట్స్ ప్రాబ్లెమ్ కారణంగా వదులుకోవడంతో కీర్తి సురేష్ హవా టాలీవుడ్ లో ఒక రేంజ్ లో నడుస్తుంది అనుకున్నారు. అందులోని పవన్ పక్కన కెరీర్ ఆరంభంలోనే ఛాన్స్ అందుకున్న కీర్తికి ఎదురుండదనుకున్నారు అంతా. ఒకే ఒక్క ఏడాదిలో కీర్తి కిరీటం టాలీవుడ్ లో ఎగురుతుంది అనుకుంటే.. ప్రస్తుతం కీర్తి సురేష్ హవా టాలీవుడ్ లో ఎక్కడా లేదు. ఆమె నటించిన మహానటి సినిమా విడుదలైతే తప్ప కీర్తి కిరీటం మళ్ళీ ఎగిరేలా కనబడటం లేదు.

Advertisement
CJ Advs

అజ్ఞాతవాసి సినిమాతో ఒక్కసారిగా కిందకి జారిపోయింది కీర్తి. ఆ సినిమా అసలు ఏం చూసి ఒప్పుకుంది అనుకున్నారు. ఆ సినిమా కోసం మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా వదులుకుంది అమ్మడు. అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ప్లాప్ తో కీర్తి కూడా నిజంగానే అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ తో కీర్తి ఇప్పుడు అవకాశాలు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అందులోనూ కీర్తి సురేష్ సావిత్రి పాత్ర కోసం బరువు పెరగడం కూడా ఆమె అవకాశాలకు గండి పడినట్లయింది. మరి అజ్ఞాతవాసికి ముందు వరుస ఆఫర్స్ వచ్చిన ఆమెకు ప్రస్తుతం ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు.

ఇప్పుడు స్టార్ హీరో ఆప్షన్ మొత్తం పూజ హెగ్డే, కైరా అద్వానీలదే. రామ్ చరణ్ తో రంగస్థలంలో జిగేలు రాణి అంటూ ఊర మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన పూజ హెగ్డేకి మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ల సినిమాల్లో ఆఫర్స్ తో లక్కీ హీరోయిన్ అయ్యింది. అలాగే కైరా అద్వానీ నటించిన భరత్ అనే నేను సినిమా విడుదల కాక మునుపే అమ్మడుకి చరణ్ - బోయపాటి సినిమాల్లో ఆఫర్ తగిలింది. మరి ఆ ఇద్దరు హీరోయిన్స్ ముందు కీర్తి సురేష్ కిరీటం కుప్ప కూలిపోయేలా వుంది. పాపం కీర్తి.

No Offers to Heroine Keerthi Suresh in Tollywood:

Agnathavasi Effect on keerthi Suresh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs