Advertisement
Google Ads BL

భరత్ ప్లాన్ మాములుగా లేదుగా ?


ఈమధ్యన అన్ని సినిమా దర్శక నిర్మాతలు ఓవర్సీస్ మార్కెట్ మీద బాగా దృష్టి పెడుతున్నారు. ఇక్కడ మార్కెట్ తో సమానంగా అక్కడ కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ - సుకుమార్ ల 'రంగస్థలం' అయితే ప్రీమియర్స్ విషయంలో బాహుబలి తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇక ఆదివారం నాటికే రెండు మిలియన్ డాలర్స్ సాధించి రికార్డులు సృషించింది. ఇక మహేష్ బాబు శ్రీమంతుడు కూడా శుక్రవారం సినిమా విడుదలైతే ఆదివారం నాటికే రెండు మిలియన్ డాలర్స్ సాధించింది. మరి ప్రస్తుతం మహేష్ బాబు - కొరటాల కాంబోలో వస్తున్నా 'భరత్ అనే నేను' మీద కూడా భారీ అంచనాలున్నాయి.

Advertisement
CJ Advs

ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ ఉంది. ఎప్పుడో భరత్ అనే నేను ప్రమోషన్స్ ని స్టార్ చేసిన టీమ్ ఈ సినిమాకి మంచి క్రేజ్ ఆల్రెడీ తెచ్చేసింది. ఇప్పటికే అందరూ భరత్ అనే నేను సినిమా హిట్ అనే ఫీలింగ్ లోకి వచ్చేశారు. అంతలాంటి బజ్ ఉంది సినిమాపై. అందుకే ఈ సినిమాపై వున్న హైప్‌ దృష్ట్యా మొదటి రోజే అదిరిపోయే కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహేష్‌కి కంచుకోట లాంటి యుఎస్‌ మార్కెట్లో ప్రీమియర్ల నుంచే రెండు మిలియన్‌ డాలర్లు వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఈ సినిమాతో రికార్డుల వేట మొదలెట్టాలని చూస్తున్నారు.

మరి మహేష్ గత చిత్రం స్పైడర్ కి ప్రీమియర్ కే ప్లాప్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమాకి ప్రీమియర్స్ తోనే మిలియన్‌ డాలర్లు కలెక్షన్స్ తోనే అదరగొట్టేసింది. మరి ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ హైప్ ఉన్న భరత్ అనే నేను సినిమా ప్రీమియర్స్‌ నుంచి రెండు మిలియన్లు ఖాయమనే అంచనాలున్నాయి. మరి ఇప్పటికే శ్రీమంతుడు రికార్డులను తుడిచెయ్యడానికి రంగస్థలం రెడీ అవుతుంది. మరి రంగస్థలం, శ్రీమంతుడిని కొట్టేస్తే... రంగస్థలాన్ని మహేష్ భరత్ అనే నేను కొట్టేయ్యడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. మరి అలా రికార్డులు కొల్లగొట్టడానికి సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే వర్కౌట్ అవుతుంది... లేదంటే మాత్రం ఢమాల్.

Bharat Ane Nenu Targets 2M with Premieres:

Bharat Targets Ram Charan Rangasthalam in Overseas Collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs