Advertisement
Google Ads BL

రామోజీరావుకే ఎసరు పెట్టింది!


నటి శ్రీరెడ్డి చెబుతున్న కథలు నిజమో..లేక కాకమ్మ కథలో, లేక ఇలాగైనా సెలబ్రిటీని కావచ్చనే ఆశో.. ఇలా బెదిరించి అవకాశాలు సంపాదించే ఉద్దేశ్యమో, తనకి చాన్స్‌లు ఇవ్వని వారిని టార్గెట్‌ చేసుకుంటున్న వైనమో తెలియక ఇండస్ట్రీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. అలాగని వదిలేస్తే ఆమె మరింతగా రెచ్చిపోతోంది. ఎవరెవరి పేర్లో చెబుతోంది. ఇందులో శేఖర్‌ కమ్ముల వంటి ఏమి తెలియని వారిని కూడా ఇరికిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఆమె ఎందుకు ఇలా చేస్తోంది? అని ఖండిస్తే అది మరింతగా పబ్లిసిటికి దారితీస్తుందని, జాతీయ మీడియా దృష్టిలో పడితే టాలీవుడ్‌ పరువు కూడా పోతోందని కొందరు తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. నేడు దాసరి వంటి వారు లేని లోటు. ఆమెని పిలిపించి మాట్లాడే స్థాయి, సమయం ఎవ్వరికీ లేకుండా పోతోంది. ఎవరికి వారు నోటికొచ్చినట్లు తమ పేర్లు కూడా చెప్పకుండా ఉంటే చాలని మౌనంగా ఉంటున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ఈనాడు విషయానికి వస్తే మీడియా మొఘల్‌ రామోజీరావుకి ఆయన సంస్థలకు ఖచ్చితమైన రెప్యూటేషన్‌ ఉంది. కానీ రామోజీరావు ముసలి వాడు కావడంతో కొడుకు కోడళ్ల హయాంలో అక్కడ కూడా చీడపురుగులు ఉన్నాయన్నది వాస్తవమే. కాబట్టి రామోజీరావు తనకి సమయం కేటాయించాలని, అప్పుడే అనిల్‌ వంటి వ్యక్తుల దురాగతాలు బయటకి వస్తాయని శ్రీరెడ్డి సోషల్‌ మీడియా ద్వారా రామోజీరావుని కోరింది. ఈనాడు గ్రూప్‌లో మరీ ముఖ్యంగా ఈటీవీలో జరుగుతున్న దురాగతాలు మీకు తెలిసే అవకాశం లేదు. మీలాంటి పెద్ద వారిని ఎలా కలుసుకోవాలో తెలియక ఇలా రిక్వెస్ట్‌ చేస్తున్నాను. నాకు మీరు టైంని కేటాయించ గలిగితే ఈటీవీకి సంబందించిన అనిల్‌ వంటి పెద్దలు మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు మీకు తెలుపుతానని విజ్ఞప్తి చేసింది. మరి దీనిపై రామోజీరావు ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది...! 

Sri Reddy Targets Ramoji Rao:

Actress Sri Reddy Shocking Comments on Ramoji Rao    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs