ఏ ఛానల్ చూసిన, ఏ వెబ్ సైట్ చూసిన రంగస్థలం గురించే. సినిమా చూసిన వారంతా పొగడకుండా ఉండట్లేదు. టాలీవుడ్ లో స్టార్స్ సైతం ఈ సినిమాను చూసిన రామ్ చరణ్ ని సుకుమార్ ని అభినందిస్తున్నారు. సినిమా చూడని మోహన్ బాబు కూడా చరణ్ ను.. సుకుమార్ ను అభినందిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. అయితే అల్లు ఫ్యామిలీ నుండి ఈ సినిమా గురించి ఒక పోస్ట్ కూడా పడలేదు.
శిరీష్ కూడా చాలా లేట్ గా రియాక్ట్ అయ్యాడు. కానీ ఇంతవరకు అల్లు అర్జున్ నుండి ఎటువంటి స్పందన లేదు. అయితే అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ కారణంగానే అంటున్నారు. బన్నీ ఈ చిత్రాన్ని థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అనుభవించాలని భావిస్తున్నాడట. అందుకే ఇంకా పోస్ట్ పెట్టలేదట. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలీదు కానీ.. సినిమా చూడకుండా పోస్ట్ చేయలేడా. మూవీ చూడలేదు అంటూనే ఇంతటి విజయం సాధించినందుకు కంగ్రాట్స్ చెప్పవచ్చు కదా. కానీ బన్నీ అది కూడా చేయలేదు.
ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిపోయాక చూసే అవకాశం వుంది. అంటే షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటది ఆ తర్వాత సినిమా రిలీజ్ హడావిడి ఉంటది అంటే ఇప్పట్లో బన్నీ రంగస్థలం గురించి పట్టించుకునే అవకాశం లేదని తెలుస్తుంది.