ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తూ, ఏ దురలవాట్లు లేని, డబ్బుకి లొంగని దర్శకునిగా శేఖర్‌కమ్ములకు గుడ్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమా చూడకముందే బాగుందని చెప్పాలనేది నచ్చక ఏ ఫంక్షన్స్‌కి కూడా వెళ్లడు. ఓ సినిమా చూసిన తర్వాత ఏమాత్రం తేడా లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తన వారితో మాట్లాడుతాడు. ఇక కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం నుంచి అచ్చమైన తెలుగు చిత్రాలు, సంప్రదాయాలు విలువలు, అసభ్యతకు తావు లేని చిత్రాలు, హీరోయిన్లకు కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే చిత్రాలు తీయడంలో ఈయనకి ఈయనే సాటి. ఇక ఈయన హీరోయిన్లుగా కూడా పలువురికి బ్రేక్ ఇచ్చాడు. ఇక నిత్యకృష్ణన్ నుంచి కమలిని ముఖర్జీ, తమన్నా వంటి ఎందరికో బ్రేక్ ఇచ్చాడు. ఇక నిఖిల్, వరుణ్‌సందేశ్, విజయ్ దేవరకొండ వంటి వారికి కూడా ఆయన మంచి లైఫ్ ఇచ్చాడు. ఈయన డబ్బులకి లొంగే వ్యక్తి కూడా కాదు. విషయానికి వస్తే నోటికి వచ్చిన పేర్లు చెబుతూ, తమ్మారెడ్డి భరద్వాజ ముందే స్టూడియోలను బ్రోతల్ హౌస్‌లతో పోల్చింది శ్రీరెడ్డి. తన ఇష్టం వచ్చినట్లు ఆడవారు కదా...! ఆడవారు ఏమి చెప్పినా నమ్ముతారు. చట్టాలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయనే ధోరణిలో ఆమె బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ సినిమాలలో అవకాశాల కోసం ఇలా మాట్లాడుతోందని అందరు భావిస్తున్నారు. తాజాగా ఈమె శేఖర్‌కమ్ములను ఇన్‌డైరెక్ట్‌గా కార్నర్ చేస్తూ...పెద్ద డైరెక్టర్ అని పొగరు. అబద్దాలు చెప్పడంలో దిట్ట. తెలుగమ్మాయిలు పక్కలోకి తప్ప ఎందుకు పనికి రారని ఆయన ఉద్దేశ్యం, ప్రామిస్‌లు చేయడంలో ఈయన దిట్ట. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండు ఎక్కువే. టెక్నిక్‌ల్‌గా దొరకకుండా బాగా వాడాడు టెక్నాలజీని. మా ఇంటి కింద గుర్ఖాలా తిరిగాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసుకుంటాడు పాపం...మేల్ ఆర్టిస్టుల నుంచి డబ్బులు తీసుకుంటాడని టాక్. వాడెవడో కాదు.. కొమ్ముల వచ్చిన శేఖరుడు అని అనేసింది.
దాంతో పాపం శేఖర్‌కమ్ముల ఆమె నటించిన చిత్రాలు ఏమిటో? ఏ చిత్రాలలో నటించిందో రెగ్యులర్‌గా సినిమాలు చూసే ప్రేక్షకులకే తెలియని అపిరిచితురాలు ఇలా వాగడంతో పాపం మనస్థాపం చెందాడు. దీనిపై ఆయన స్పందిస్తూ, నన్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ నా దృష్టికి వచ్చింది. ఈ పోస్ట్‌లోని ప్రతి మాటా అబద్దం. అసభ్యకరం, అవమానకరం, ఈ పోస్ట్ నాకు, నా కుటుంబ సభ్యులకు, నన్ను అభిమానించే వారందరికీ తీవ్ర మనస్తాపం కలిగించింది. నేను ఎప్పుడు కలవని, చూడని, కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడని అమ్మాయి నా మీద ఆధారాలు లేని ఆరోపణలు చేయడం షాకింగ్‌గా ఉంది. ఈ దిగజారుడు చర్యవెనక ఎవరు ఉన్నా, వారి ఉద్దేశ్యం ఏమైనా, నేను చెప్పదలుచుకుంది ఒక్కటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీల సమానత్వం, సాధికారికతను నేను ఎంతగా కోరుకుంటానో నా చిత్రాలు చూసేవారికి, నేను చేసే కార్యక్రమాలు తెలిసిన వారికి బాగా తెలుసు. నా వ్యక్తిత్వం, నేను నమ్మే విలువలు నాకు ప్రాణం కన్నా ఎక్కువ. వాటి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. ఆ పోస్ట్‌లోని ప్రతి మాట, ప్రతి అక్షరం తప్పు అని ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఆమెపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటానని శేఖర్‌కమ్ముల స్పందించాడు. మరి ఈయన విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది...!