Advertisement
Google Ads BL

చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి.. బడ్జెట్ షాక్..!


టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ రాజమౌళి మల్టీ స్టారర్. ఈ సినిమా స్టోరీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని చరణ్, ఎన్టీఆర్ చెప్పారు. అయిన కానీ ఈ సినిమాపై విపరీతంగా చర్చ జరిగేలా చేయటం ఒక్క రాజమౌళికే సాధ్యం. ఆ సినిమాకు సంబంధించి ఏ న్యూస్ వచ్చిన అది హాట్ టాపిక్ గా మారుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదే ఈ సినిమా బడ్జెట్ గురించి. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ ఏది లేదన్న 250 కోట్ల దాకా బడ్జెట్ అవుతుందని టాక్. ఆల్రెడీ ఇంత బడ్జెట్ అవుతుందని రాజమౌళి ప్రొడ్యూసర్ డివివి దానయ్యకు చెప్పినట్టు సమాచారం. బాహుబలి సినిమాకు దీనిని మించి అయింది కానీ ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు. ఎందుకంటే అది ఒక ఫాంటసీ చిత్రం ఇప్పటి వరకు ఎవరు చూడని రీతిలో తెరకెక్కించారు కాబట్టి భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా దానికి బ్రహ్మరధం పట్టారు.

కానీ ఇది మల్టీ స్టారర్ మూవీ అండ్ ఓ కమర్షియల్ మూవీ. చాలా రెగ్యులర్ గా హీరోయిజంని ఎలివేట్ చేస్తూ తనదైన శైలిలో తీస్తాడు జక్కన్న. మరి ఇంత బడ్జెట్ ఎందుకు అన్న అనుమానం రాక మానదు. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది ఒక కమర్షియల్ సినిమానే కావొచ్చు కానీ ఇందులో యాక్షన్ సీక్వెన్స్ భారీ కాన్వాస్ ఉందట అందుకే అంత బడ్జెట్ తప్పదని చెబుతున్నారు. నాకో విషయం ఏంటంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ - చరణ్ రెమ్యునరేషన్లు కలిపే ఉన్నాయో లేదో ఇంకా తెలియాల్సివుంది. ఒకవేళ బడ్జెట్ తో రెమ్యునరేషన్లు కలపకపోతే సినిమా మరింత పెరిగే అవకాశం వుంది. ఏది అయితే ఏముంది ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ న్యూస్ వైరల్ అయింది. కాంబినేషన్ అటువంటిది కాబట్టి న్యూస్ లు వైరల్ అవ్వటం కామన్.

RRR Budget Revealed:

Shocking Budget to Ram Charan, Rama Rao and Rajamouli film <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs