ఎక్కడ చూసినా రంగస్థలం లోని రామ్ చరణ్ చిట్టిబాబు క్యారెక్టర్ ముచ్చట్లే. సుకుమార్ తో కలిసి రామ్ చరణ్ రంగస్థలం తో గట్టిగా హిట్ కొట్టేశాడు. సినిమా హిట్ టాక్ తో ఆ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ మరుగున పడిపోయాయి. సినిమా లెంత్ ఎక్కువగా వున్నా సినిమా మీద ఉన్న హిట్ టాక్ తో ఆ నిడివి కూడా చర్చకు రావడంలేదు. అయితే రామ్ చరణ్ మొదటిసారి మాస్ గా పల్లెటూరి కుర్రాడిలా నటనలో 100 పర్సెంట్ సక్సెస్ కొట్టాడు. అయితే రామ్ చరణ్ చిట్టిబాబు నటనకు ప్రేక్షకులే కాదు చరణ్ సన్నిహితులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇప్పటికే చరణ్ ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గర నుండి రామ్ చరణ్ ఫ్రెండ్స్, సన్నిహితులు అందరూ చరణ్... చిట్టిబాబు నటనను తెగ మెచ్చేసుకుంటున్నారు.
కానీ అల్లు హీరోలు మాత్రం ఏం మాట్లాడకుండా గమ్మునున్నారు. ఏదో అల్లు శిరీష్ రంగస్థలం విడుదలయ్యాక సినిమా చూడలేదు గాని చరణ్ నటన అద్భుతం అంటున్నారు అని ట్విట్ చేశాడు. సినిమా చూశాక చరణ్ ని, టీమ్ ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. ఇక అల్లు మెయిన్ హీరో అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్ రంగస్థలం మీద ఎటువంటి కామెంట్ చెయ్యలేదు. ఆ సినిమా పాటలు తన కొడుకు అయాన్ కి బాగా నచ్చాయని.. మామ లాగ చిట్టిబాబు లుక్ లో తన కొడుకుని చూడమని సినిమా విడుదలకు ముందు హడావిడి చేసాడే కానీ.... సినిమా విడుదలై నాలుగు రోజులవుతున్నా.. ఇప్పటివరకు సినిమా చూసే తీరిక లేకపోయినా కనీసం అందరిలా చరణ్‌ని అభినందించడానికి క్షణం తీరిక చేసుకోలేకపోయాడా అంటూ మెగా అభిమానులు కాస్త ఆగ్రహంగానే ఉన్నారు.
మరి పవన్ విషయంలో అల్లు అర్జున్ మెగా ఫాన్స్ ని సైడ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు బావ రామ్ చరణ్ విషయంలోనూ అలానే ఉన్నారా ఏమిటి అనే అనుమానం ఇప్పుడు మెగా ఫాన్స్ లో బలపడుతుంది. ఎందుకంటే రామ్ చరణ్.. అల్లు అర్జున్ కి ప్రస్తుత మెగా హీరోల్లో తనకు గట్టి కాంపిటీటర్ గా ఉన్నాడు. అందుకే ఇప్పుడు చరణ్ హిట్ ని అల్లు అర్జున్ ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాడనే టాక్ మెగా ఫ్యాన్స్ లో మొదలయిందని అంటున్నారు. మరి రాజకీయాలతో బిజీగా ఉండి.. నిన్నమొన్నటివరకు మెగా ఫ్యామిలీతో కాస్త దూరంగా ఉన్న పవన్ కూడా తన అన్నకొడుకు చరణ్ తో కలిసి రంగస్థలం స్పెషల్ షో ని సోమవారం వీక్షించి మరీ చరణ్ ని మెచ్చు కుంటే.. అల్లు అర్జున్ మాత్రం ఎలాంటి కామెంట్ చెయ్యకుండా సైలెంట్ అవడం మాత్రం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.