ఒక సినిమా హిట్ అయితే ఆ చిత్రంలో నటించిన వారికి, సాంకేతిక నిపుణులకు మంచి పేరు వస్తుంది. అందునా ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ అయితే మరింత క్రేజ్‌ని సంతోషాన్ని ఆ విజయం అందిస్తుంది. కానీ కొన్నిసార్లు సినిమా బ్లాక్‌బస్టర్ అయినా కొందరి విషయంలో అనుకోకుండా జరిగిన పరిణామాలు బాధనే మిగులుస్తాయి. ముఖ్యంగా తమ పాత్రల నిడివిని తగ్గించినప్పుడు, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయినా ఆ నటుడికి అది మరింత వేదనను కలిగిస్తోంది. ఇక విషయానికి వస్తే తాజాగా 'రంగస్థలం' చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. మాస్ సినిమాలను ఓవర్‌సీస్ వారు చూడరు అనే వాదనకు ఇది ఫుల్‌స్టాప్ పెట్టింది. ఎంత మాస్ చిత్రమైనా క్లాస్‌గా తీస్తే అన్ని వర్గాల వారు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపిస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ, చిరు, చరణ్, ఉపాసనలతో పాటు మెగాభిమానులు కూడా అనందంగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి పనిచేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
అయితే ఓ కమెడియన్‌కి మాత్రం ఈ చిత్రం బాధగా మారింది. అతను ఎవరో కాదు 30 ఇయర్స్ పృథ్వీ. ఈ చిత్రం సెన్సార్ సమయంలోనే సినిమా రన్‌టైం 2గంటల 50 నిమిషాలు అనే న్యూస్ బయటికి వచ్చింది. దాంతో సుకుమార్ ఎడిట్ చేయాలనుకున్నాడట. కానీ చిరంజీవి సినిమా చూసి ఒక్క సీన్‌ని కూడా తీయవద్దు. తీస్తే ఫ్లో దెబ్బ తింటుందని చెప్పడంతో సుకుమార్ ఈ చిత్రాన్ని 2.50నిమిషాలు గానే ఉంచాడు. ఇక ప్రభుత్వ ప్రకటనలతో సహా కలుపుకుంటే ఇది మూడు గంటలకు పెరిగింది. అయితే సినిమాని చిరంజీవి చూసే ముందే సుకుమార్ ఈ చిత్రంలో పృథ్వీ, రామ్‌చరణ్‌ల మీద సాగిన ఓ కామెడీ ట్రాక్ బాగా వచ్చినప్పటికీ కథ ఫ్లోని దెబ్బతీసే విధంగా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో దానిని సినిమా నుంచి తీసివేశారట. ఇక ఇలా తీసేసిన వాటిల్లో రామ్‌చరణ్-సమంతల మద్య వచ్చే రొమాన్స్ ట్రాక్‌కి సంబంధించి కూడా కొన్ని సీన్స్ ఉన్నాయట. మరి ఈ సీన్స్‌కి మరలా కలుపుతారా? లేక డిజిటల్ రూపంలో వచ్చినప్పుడు అందులో ఉంటే చూసుకోవాల్సిందేనా? అనేది తెలియాల్సివుంది...!