Advertisement
Google Ads BL

సమంత ఆన్సర్స్‌ టకాటకా చెప్పేసింది!


సమంత మంచి మాటకారి, అందులోనూ అల్లరి పిల్ల అన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా ఆమె తనలో ఏ మార్పు రాలేదని, తన వృత్తి జీవితం నుంచి వ్యక్తిగత జీవితంలో కూడా తాననుకున్నవన్నీ చేస్తున్నానని చెబుతోంది. ఇక ఈమె ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో కలిసి అమెరికా వెకేషన్స్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. దాంతో 'రంగస్థలం' విడుదలైనప్పుడు ఆమె అమెరికాలోనే ఉండటంతో తాజాగా నిర్వహించిన థ్యాంక్స్‌ మీట్‌కి కూడా ఆమె రాలేకపోయింది. దాని గురించి ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రంలో చేయడం అదృష్టం. ఇలాంటి యూనిట్‌తో పని చేసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇక ఈచిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రేక్షకులు నా మీద చూపుతున్న ప్రేమాభిమానాలు, సినిమాకి చూపుతున్న ఆదరణ ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఈ సమయంలో నేను అక్కడ లేనందుకు సారీ అంటూ ట్వీట్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె మీ జీవితంలో మర్చిపోలేని రోజు ఏమిటి? అని అడిగితే నా పెళ్లిరోజు అని, నాగచైతన్య భార్యగా, నాగార్జున కోడలిగా, అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా దేనిని బాగా ఆనందిస్తున్నారు అన్న ప్రశ్నకు కష్టమైన ప్రశ్నే అని అంటూ నా భర్తకి భార్యను కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. మీరు మగవారైతే ఎవరిని క్రష్‌ చేసేవారు అంటే దీపికా పడుకోనే పేరు చెప్పింది. ఇక రామ్‌చరణ్‌ గురించి చెబుతూ, ది బెస్ట్‌.. ఎంతో సౌమ్యుడు అని సమాధానం ఇచ్చింది. ఇక నేటి హీరోయిన్లలో తెలుగు, తమిళంలో మీకు నచ్చిన వారు ఎవరు అని ప్రశ్నిస్తే సాయిపల్లవి పేరు చెప్పింది. ఇలా ఈమె ప్రతి ప్రశ్నకు ఎంతో సమయస్ఫూర్తితో సమాధానం చెప్పి వావ్‌.. అనిపించుకుంది.

Samantha Live Chat in Social Media:

Samantha about Her Family and Ram Charan in Live Chat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs