Advertisement
Google Ads BL

రియల్: హీరోయిన్‌ ని చితక్కొట్టిన హీరో..!


ఈమధ్య హాలీవుడ్‌ నిర్మాత హార్వే కాస్టింగ్‌ కౌచ్‌ నుంచి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులందరూ తమకు కూడా లైంగిక వేధింపులు జరిగాయని 'మీటూ' అనే ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇక మలయాళ నటి భావన అత్యాచారం, కిడ్నాప్‌ కేసు, అందులో మలయాళ హీరో దిలీప్‌ హస్తం ఉందని అరెస్ట్‌ నేపధ్యంలో ఇండియన్‌ సినిమా రంగంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని పెద్దపెద్ద హీరోయిన్లే బయటికి వచ్చి చెబుతున్నారు. రాధికా ఆప్టే నుంచి శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మీ వరకు దీనికి బాధితులమేనని తెలిపారు. కానీ వీరు కేవలం ఏదో తమకూ ఇది జరిగింది అని చెప్పకుండా వారి పేర్లు కూడా బయటపెడితేనే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. లేకపోతే ప్రజలు అందరినీ అనుమానించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇక హీరోయిన్స్‌ ఇలా బహిరంగంగా పేర్లు చెబితే, ఆమెని పెట్టుకుంటే రచ్చ ఎందుకు అని భావించి, వారికి వచ్చే అవకాశాలను కూడా ఇవ్వరని హీరోయిన్ల భయంలో కూడా నిజముంది. నటి, రస్నాబేబీ అంకిత విషయంలో నవదీప్‌ సంఘటనలో ఇది నిరూపితం అయింది. ఇక తాజాగా శ్రీరెడ్డి పలువురి భాగోతాలను బయటపెడుతూ, ఆధారాలు కూడా చూపిస్తానంటోంది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఓ హీరోయిన్‌పై జరిగిన ఘటన సంచలనంగా మారింది. భోజ్‌పురి చిత్రాలలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న పవన్‌సింగ్‌ అనే నటుడు, తన సహచరనటి అక్షరాసింగ్‌ని మద్యం మత్తులో దాడి చేశాడు. ఆమెని మద్యం మత్తులో చితకబాదాడు. ఈ ఘటన గురించి జర్నలిస్ట్‌ శశికాంత్‌ సింగ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పవన్‌సింగ్‌, అక్షరాసింగ్‌లు ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ కేంద్రపాలిత ప్రాంతమైన దాదా నగర్‌హవేలి రాజధాని సిల్వాసాలోని దామన్‌గంగా రిసార్ట్స్‌లో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న పవన్‌సింగ్‌ అక్షరసింగ్‌ జుట్టును పట్టుకుని, ఆమె తలని గోడకేసి బాదాడు. దీంతో ఆమె తలకి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అరుపు విని ఆ హోటల్‌ సిబ్బంది ఆమెని కాపాడేందుకు ప్రయత్నించగా, పవన్‌సింగ్‌ వారిపై కూడా దాడి చేశాడు. ఆమె పట్ల దాడి చేయడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించి, పరుష పదజాలంతో బూతులు కూడా తిట్టాడని ఆ జర్నలిస్ట్‌ శశికాంత్‌ సింగ్‌ తెలిపాడు. మరి ఈ ఘటనపై పోలీసులు, బోజ్‌పురి సినీ పెద్దలు ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి వుంది. కాగా గతంలో పవన్‌సింగ్‌, అక్షరసింగ్‌లు ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత వారిద్దరి మధ్య ఎఫైర్‌ బ్రేకప్‌ అయింది.

Bhojpuri Actor Pawan Singh Thrashes Akshara Singh:

Real: Bhojpuri Hero Thrashes Heroine
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs