సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు బాక్సాఫీస్ వద్ద చేస్తున్న సౌండ్‌కి రికార్డులన్ని బద్దలు అవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చినా కూడా ఇంకా పలు చోట్ల అంత కంటే ఎక్కువ షోలే పడుతున్నాయి. ప్రేక్షకుల డిమాండ్ మేరకు షోల సంఖ్య పెరుగుతోంది. ఇక ఈ చిత్రానికి తమిళ నాట కూడా కలిసి వచ్చింది. తమిళనాడులో బంద్ వల్ల కొత్త చిత్రాలు ఏవీ రిలీజ్ కాకపోవడంతో 'రంగస్థలం' కలెక్షన్ల వర్షం కురిపిస్తూ తొలిరోజునే 25లక్షలు వసూలు చేసింది. ఇక ఓవర్‌సీస్‌లో సుకుమార్‌కి ఉన్న క్రేజ్ ఎంతో అందరికీ తెలిసిందే. దానికి తోడు ప్రొమోలు, టీజర్లు, ట్రైలర్స్ అన్ని నాటి గ్రామీణ నేపధ్యంలో ఉండటంతో ఇది ఓవర్‌సీస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రెండు మిలియన్ డాలర్ల వైపు అడుగులు వేస్తోంది. ఈ వారాంతం దాకా ఇదే హవా ఉంటే తెలుగులోని టాప్5 చిత్రాలలో దీనికి కూడా చాన్స్ దొరికే అవకాశం ఉంది. ఇంతకు ముందు వరకు నాన్ 'బాహుబలి' రికార్డుగా 'శ్రీమంతుడు' చిత్రం 2.89 మిలియన్ డాలర్ల వద్ద స్టడీగా ఉంది.
ఇక 'రంగస్థలం' మొదటి రెండు రోజులతో పాటు ఆదివారంతో పాటు మిగిలిన వీక్‌డేస్‌లో కూడా ఓవర్‌సీస్‌లో భారీ కలెక్షన్లు సాధించడం ఖాయమని తద్వారా శ్రీమంతుడు రికార్డులను 'రంగస్థలం' బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంతో రామ్‌ఛరణ్‌కి 'మగధీర' తర్వాత ఓవర్‌సీస్‌లో మంచి బ్రేక్‌నిచ్చిన మూవీగా 'రంగస్థలం' నిలవనుంది. 2 మిలియన్లను ఈజీగా క్రాస్ చేస్తుందని, ఆ తర్వాత సాగే స్టడీ కలెక్షన్లతో 'శ్రీమంతుడు'ని 'రంగస్థలం' మించుతుందా? అనేది వేచిచూడాల్సివుంది. మరోవైపు 'శ్రీమంతుడు'తో పాటు 'రంగస్థలం' మూవీని కూడా నిర్మించింది మైత్రి మూవీమేకర్స్ సంస్థే కావడం గమనార్హం. ఈసంస్థ యువి క్రియేషన్స్‌తో పోటీపడుతూ, అతి తక్కువ చిత్రాలతోనే పెద్ద నిర్మాణ సంస్థగా, గ్యారంటీ హిట్స్ ఇచ్చే సంస్థగా గుడ్‌విల్‌ని సాధించుకుంది.