Advertisement
Google Ads BL

శ్రీరెడ్డి లీక్స్‌ మొదలయ్యాయి....!


వికీలీక్స్‌తో రాజకీయ, ఆర్ధిక వ్యవహారాలపై బయటికి వచ్చిన రహస్యాలు... మొదలైన హంగామా సుచీలీక్స్‌ ద్వారా సినీ పరిశ్రమకి కూడా తగిలాయి. హాలీవుడ్‌ నిర్మాత హార్వే, ఆయన కాస్టింగ్‌ కౌచ్‌కి పాల్పడే వ్యవహారం, మలయాళ నటి భావన కేసు, ఆమెపై హత్యాయత్నం, కిడ్నాప్‌ యత్నాలు తర్వాత సుచీలీక్స్‌ పలువురు సినీ రంగ ప్రముఖులను, ముఖ్యంగా కోలీవుడ్‌ వారిని టార్గెట్‌ చేశాయి. ఇప్పుడు శ్రీరెడ్డి పేరుతో మరో నటి 'మీటూ' లో భాగంగానే కాకుండా శ్రీరెడ్డి లీక్స్‌ బిగిన్స్‌ అంటోంది. తనని అవకాశాల పేరుతో లొంగదీసుకున్నారని కౌండిన్య అనే డైరెక్టర్‌ని, బాలకృష్ణతో 'శ్రీమన్నారాయణ', రవితేజతో 'మిరపకాయ్‌', నాని 'పైసా' చిత్రాలకు నిర్మాతగానే కాకుండా 'ఆటోనగర్‌సూర్య' నుంచి రేపు త్వరలో ప్రారంభం కానున్న రాజమౌళి-ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ల మూవీకి కూడా దానయ్యతో పాటు సహ నిర్మాతగా వ్యవహరించున్నాడని వార్తలు వస్తున్న నిర్మాత రమేష్‌ పుప్పాలపై ఆరోపణలు చేసింది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె తాజాగా ఈటీవీ చానెల్‌లో పనిచేసే ఓ ప్రోగ్రాం డైరెక్టర్‌ అయిన అనిల్‌పై ఆరోపణలు చేసింది. ఆయన ప్రోగ్రాములకు వచ్చే అమ్మాయిలను, యాంకర్లుగా ట్రై చేసేవారిని లొంగదీసుకుని పలు అకృత్యాలకు పాల్పడుతున్నాడంటూ డైరెక్ట్‌గా పేరు చెప్పేసింది. ఎవరో చేస్తున్నారు? అంటూ అందరిపై బురదజల్లడం కాకుండా పేర్లను కూడా ప్రకటిస్తున్న శ్రీరెడ్డి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఆ ప్రోగ్రాం డైరెక్టర్‌ అయిన అనిల్‌ కడియాల ఓ బజారు వెధవ అని కామెంట్‌ చేసింది. అవకాశాల పేరుతో అమ్మాయిలను లొంగదీసుకుంటున్నాడని, అనిల్‌ వేధింపులపై తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది. అనిల్‌ అకృత్యాలకు ఆయన భార్య కూడా సహకరిస్తుంది. పెద్ద యాంకర్‌ అయిన అతని భార్యకి ఎన్నో పరిచయాలు ఉన్నాయని, నన్ను ఎవరితో బెదిరిస్తుందో అని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి విషయాన్ని స్పష్టంగా పేరుతో సహా చెప్పినందున ఇక ఎవ్వరూ ఆమెని ఏమీ చేయలేరు. ఇక ఈ వివాదం పుణ్యమా అని శ్రీరెడ్డికి ఏకంగా నాలుగు అవకాశాలు వచ్చాయి. తేజ-వెంకటేష్‌, తేజ-బాలకృష్ణ చిత్రాలలో ఈమె పాత్రలు చేస్తుండగా, ప్రతాని రామకృష్ణ గౌడ్‌, 'నా బంగారు తల్లి' దర్శకుడు రాజేష్‌ టచ్‌ లీవర్‌తో శంకర్‌గౌడ్‌ నిర్మిస్తున్న చిత్రాలలో తనకి 'హీరోయిన్‌' చాన్సులు వచ్చాయని శ్రీరెడ్డి చెబుతోంది. 

Actress Sri Reddy Leaks Started:

Actress Sri Reddy begins 'Leaks' on Facebook
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs