Advertisement
Google Ads BL

రవితేజ ఏ నిర్ణయం తీసుకోనున్నాడు..?


మాస్‌మహారాజాగా పేరొందిన రవితేజ 'బెంగాల్‌ టైగర్‌' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని దిల్‌రాజు నిర్మాణంలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్‌' చేశాడు. ఇది మామూలు కమర్షియల్‌ చిత్రమే అయినప్పటికీ ఇందులో హీరో అంధునిగా చూపించిన విధానం నచ్చడంతో ఈ చిత్రం మంచి హిట్‌ అయింది. దాంతో రవి తేజ ఇక నుంచి తాను చేసే చిత్రాలు విభిన్నంగా ఉంటాయని, ప్రేక్షకులు రొటీన్‌ చిత్రాలను ఆదరించడం లేదని, కొత్తదనాన్నికోరుకుంటున్నారు అని అంటూనే మరో రొటీన్‌ చిత్రంగా 'టచ్‌ చేసి చూడు' చేశాడు. అనుకున్నట్లే ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. దాంతో రవితేజపై విమర్శలు వచ్చాయి. దానిపై స్పందించిన రవితేజ తనకు సూట్‌ అయ్యే పాత్రలే చేస్తానని, గతంలో తాను చేసిన 'నా ఆటోగ్రాఫ్‌స్వీట్‌ మెమరీస్‌, నేనింతే, శంభో శివ శంభో, సారొచ్చారు' వంటివి ఫ్లాప్‌ అయ్యాయి కాబట్టి తనకు నచ్చిన చిత్రాలు చేస్తానని మరోసారి మాట తప్పాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈయన ప్రస్తుతం 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్‌వేడుక చూద్దాం' చిత్రాల ద్వారా మొదటి రెండు చిత్రాలను సూపర్‌హిట్స్‌గా నిలిపిన కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్‌' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. టైటిల్‌ విభిన్నంగా ఉండటం, సినిమా కథలో కాకపోయినా కథనంలో వైవిద్యం చూపించే కళ్యాణ్‌ కృష్ణ వల్ల ఈ చిత్రానికి పాజిటివ్‌ బజ్‌ ఏర్పడింది. ఇక తాజాగా 'టైగర్‌,ఎక్కడికిపోతావు చిన్నవాడా, ఒక్కక్షణం' చిత్రాల దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ ఓ స్టోరీని రవితేజకి చెప్పాడని తెలుస్తోంది. పూర్తి విభిన్నంగా, ఎవ్వరూ టచ్‌ చేయని పాయింట్‌ కావడంతో ఉన్న ఈ చిత్రంలో నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అనే డైలమాలో రవితేజ ఉన్నాడని సమాచారం. ఇక రవితేజ నటించిన ప్రయోగాలే కాదు...పక్కా మాస్‌ చిత్రాలు కూడా డిజాస్టర్స్‌గా నిలిచాయి. కాబట్టి కేవలం కొత్తదనం వల్లనే ప్రేక్షకులు ఆదరించడంలేదుఅనే మాటను పక్కనపెట్టి తన ఇమేజ్‌ కి భిన్నంగా వెళ్లితే రవితేజకి కనీసం ప్రశంసలైనా దక్కుతాయని చెప్పవచ్చు. 

VI Anand To Direct Ravi Teja For His Next:

VI Anand To Direct Ravi Teja For His Next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs