బెంగుళూర్ లో ఇటీవల హిందూమత చాందసవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న గౌరీలంకేష్‌ని హత్య చేయడం, దీనిపై మోడీ మౌనంగా ఉండటంతో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ మోదీపై, కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈయన మాటలకు సమాధానం చెప్పలేని కర్ణాటక బిజెపి నాయకులు ఈయన్ను కేవలం తమిళనాడుకి పరిమితమైన వ్యక్తిగా చూపుతూ ప్రకాష్‌రాజ్ పై ఎదురు దాడి చేస్తున్నారు. దాంతో బిజెపి నాయకులు, ప్రకాష్‌రాజ్‌కి మాటల యుద్దం నడుస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో కూడా బిజెపి అనుకున్నని స్థానాలు రాలేదని ప్రకాష్‌రాజ్ మోదీపై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. అలాంటి విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ తెలంగాణలో ఓ పల్లెటూరుని కూడా దత్తత తీసుకున్నాడు.
ఇక తాజాగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి అసెంబ్లీకి రావడం ఆశ్చర్యానికి గురి చేసింది.ప్రకాష్‌రాజ్ ఏకంగా సీఎం కేసీఆర్ వెంట ప్రగతిభవన్ నుంచి అసెంబ్లీకి కలిసివెళ్లడంతో దీనిని రాజకీయ కోణంలోకూడా చూస్తున్నారు. ఇటీవల కేసీఆర్ బిజెపి, కాంగ్రెస్‌లకు సమానదూరం పాటిస్తూ ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఈ విషయమై ఆయన మమతాబెనర్జీ నుంచి శిబుసోరెన్ కుమారుడి వరకు అందరితో సమావేశమవుతున్నారు. మరి ఈ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ప్రకాష్‌రాజ్ తో మాట్లాడేందుకే ప్రకాష్‌రాజ్, కేసీఆర్‌ల భేటీ జరిగిందని సమాచారం. ఇక మద్యాహ్నం వీరు ప్రగతి భవన్‌లో లంచ్ కూడా చేశారు. మరి ఫెడరల్ ఫ్రంట్ నేపధ్యంలో కేసీఆర్ దూకుడు పెంచిన నేపధ్యంలో చంద్రబాబు భావిస్తున్న తృతీయ ఫ్రంట్‌కి ఎలా అడ్డంకిగా మారుతుందో చూడాల్సివుంది...! ఇక రాబోయే కర్ణాటక ఎన్నికల్లో తనకుబాగా బలమున్న తెలుగువారు ఉన్న బళ్లారి నుంచి పలు చోట్ల పవన్‌కి సన్నిహితులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. వారి తరపున కర్ణాటక ఎన్నికల్లో కూడా పవన్ ప్రచారం చేయడం ఖాయమని అంటున్నారు.