Advertisement
Google Ads BL

మెగా హీరోకి జోడిగా ఇద్దరు..!


ప్రస్తుతం మెగా హీరో వరుణ్‌తేజ్‌ హవా బాగా సాగుతోంది. వరుసగా 'ఫిదా, తొలిప్రేమ' వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తర్వాత ఆయన ప్రస్తుతం 'ఘాజీ' దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి దర్శత్వంలో ఓ స్పేస్‌ ఓరియంటెడ్‌ బ్యాక్‌ డ్రాప్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందు కోసం వరుణ్‌ తేజ ప్రస్తుతం వ్యోమగామిగా శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ పరిసన ప్రాంతాలలో స్పేస్‌ సెట్‌ని వేస్తున్నారు. ఈ చిత్రంలో షూటింగ్‌ అధిక శాతం ఇదే సెట్‌లో జరుగుతుందని సమాచారం. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక 'కంచె, ఫిదా, తొలిప్రేమ' వంటి విభిన్న సినిమాలను ఎంచుకుంటున్న వరుణ్‌ తేజ్‌ ఈ చిత్రంతో మరో వైవిధ్యభరితమైన చిత్రం చేసి, హిట్‌కొట్టడం ఖాయమని అంటున్నారు. అందుకు సంకల్ప్‌రెడ్డి పై ఉన్న నమ్మకం కూడా తోడవుతోంది. ఇక ఈ చిత్రంలో కీలకమైన సైంటిస్ట్‌ పాత్రను ప్రకాష్‌రాజ్‌ చేయనుండగా, ఓ హీరోయిన్‌గా ఆదితిరావు మరో హీరోయిన్‌గా కావ్యా థాపర్‌ అనే కొత్తమ్మాయి ఎంపికైంది. 

ఇలా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు స్థానం ఉంది అంటే.. ఈ చిత్రం ఖచ్చితంగా అటు యూత్‌ ని ఆకర్షించే గ్లామర్‌ షో, రొమాంటిక్‌ సీన్లకు కూడా కొదువు ఉండదని అంటున్నారు. ఇక త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరుగుతుండటం విశేషం. మరి సంకల్ప్‌ రెడ్డి 'ఘాజీ'లాగా యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో వివిధ భాషల్లో కూడా ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందా? లేదా? కేవలం తెలుగులోనే రూపొందుతుందా? అనేది తెలియాల్సివుంది...!

Varun Tej To Romance Two Heroines In His Next:

Varun Tej Romance With Aditi Rao Hydari and Kavya Thapar in Sankalp Reddy Directon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs