పవన్ కళ్యాణ్‌కి నితిన్ ఎంతటి వీరాభిమానో అందరికీ తెలిసిందే. ఆయన్ను నితిన్ దేవుడిలా కొలుస్తూ, పిలుస్తూ ఉంటాడు. 'ఇష్క్' చిత్రంనుంచి తన సినీవేడుకలకు పవన్‌ని రప్పించడమో... తాను చేసేచిత్రాలలో పవన్ ప్రస్తావన ఉండేట్లుగా నితిన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.. ఇక తాజాగా ఆయన పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డిల భాగస్వామ్యంతో కృష్ణచైతన్య దర్శకత్వంలో త్రివిక్రమ్ అందించిన కథతో 'చల్‌మోహనరంగ' చేస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్5న విడుదలకు సిద్దమవుతున్న సందర్భంలోపవన్ ఈ వేడుకకి రావడం, ఆయనే నిర్మాతకావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇక ఈ చిత్రంలో నితిన్ పవన్ ప్రస్తావన ఎలా తీసుకుని వచ్చిఉంటాడు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ చిత్రంలో ఓ సీన్‌లో పవన్ కూడా నటించడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈచిత్రం ప్రమోషన్స్‌లోభాగంగా నితిన్‌కి ఇందులో పవన్ ఉంటాడా? అనే ప్రశ్న ఎదురైతే.... పవన్ ఈ సినిమాలో ఉండడు. కానీ ఉన్నట్లే ఉంటుంది అని చెప్పి అందరిని అయోమయానికి గురిచూశాడు. మరి ఈ లెక్కన పవన్ ప్రస్తావన ఇందులో ఖచ్చితంగా ఉంటుందని, పవన్ రాజకీయాలలోకి వెళ్లిన నేపధ్యంలో ఆయన నిర్మాతగా బయటి హీరోతో చేస్తోన్న తొలి చిత్రం కావడంతో మెగాభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.