Advertisement
Google Ads BL

చెర్రీ చెలరేగిపోయాడు..!!


ఈరోజు ఉక్రవారం రంగస్థలం హడావిడి ప్రపంచవ్యాప్తంగా 1700 థియేటర్స్ దగ్గర కనబడుతుంది. గత మూడు నెలలుగా పెద్ద సినిమాలు ఎప్పుడొస్తాయా అని మొహం వాచిపోయిన ప్రేక్షకులకు రంగస్థలం తో తనివితీరిందనే చెప్పాలి. ఎక్కడ చూసిన రంగస్థలం సినిమా గురించిన ముచ్చట్లే వినబడుతున్నాయి. అందరూ చిట్టిబాబు, రామలక్ష్మిల లుక్ మీదే చర్చ. పల్లె వాతావరణాన్ని ఎంతో అందంగా తెరకెక్కించిన సుకుమార్ ఆ సినిమాలోని పాత్రలను కూడా అందుకు తగ్గట్టే డిజైన్ చేసి అందరిని మెప్పించాడు. ఇప్పటికే వస్తున్న టాక్ తో రంగస్థలం సినిమా సూపర్ అంటున్నారు. రామ్ చరణ్ నటన అత్యంత అద్భుతం అని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

సుకుమార్ మేకింగ్ స్టయిల్ అదిరిందంటున్నారు. సినిమా కథ సింపుల్ గా వున్నా దాన్ని సినిమాగా మలచడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడంటున్నారు . సినిమా నిడివి ఎక్కువగా ఉండడం మైనస్ అంటున్నారు కానీ పల్లె అందాలను అలా చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారనే టాక్ వస్తుంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడిన అన్ని ఏరియాల నుంచి రంగస్థలంకు సంబందించిన టాక్ అదరగొట్టేస్తుంది. అయితే రంగస్థలం ప్రీమియర్లకు ప్రీ బుకింగ్స్ తోనే చెర్రీ కొత్త రికార్డు సృష్టించాడు. ఓవర్సీస్ లో ఫస్ట్ ప్రీమియర్ పడకముందే 4లక్షల డాలర్లు కలెక్ట్ చేయగా.. ఇంకా ఫైనల్ లెక్క తేలాల్సి ఉంది. ఈ కలెక్షన్స్ తో రామ్ చరణ్ టాప్-5 ప్రీమియర్ కలెక్షన్స్ జాబితాలో చేరే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.

సంక్రాంతికి విడుదలైన పెద్ద సినిమాలేవీ ఆకట్టుకోకపోవడం, మొదటినుండి రంగస్థలం మీద పాజిటివ్ బజ్ ఉండడం, ముఖ్యంగా రామ్ చరణ్ చిట్టిబాబు లుక్ మీద వున్న విపరీతమైన క్రేజ్ కారణంగానే రంగస్థలం ప్రీమియర్స్ కి ఇది సాధ్యమైందని అంటున్నారు.ఇక సినిమాకి మ్యూజిక్ తోపాటుగా సినిమాటోగ్రఫీ ప్లస్ గా చెబుతున్నారు. అందుకే రంగస్థలం కలెక్షన్స్ కూడా అదిరిపోతాయని అంటున్నారు.

Rangasthalam Talk:

Rangasthalam Movie Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs