Advertisement
Google Ads BL

రజనీ సరసన లేడీ సూపర్‌స్టార్‌..!


నయనతార పూర్తిగా ప్రేక్షకుల దృష్టిలో పడి ఆకట్టుకున్న చిత్రం 'చంద్రముఖి'. ఇందులో రజనీకాంత్‌ సరసన ఆమె నటించింది. నాడు ఎలా ఉందో ఈ భామ ఇప్పటికీ అలాగేఉంది. అందచందాలలో ఏమాత్రం మార్పులేదు. పైగా ఇప్పుడు ఆమె సౌతిండియన్‌ లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతోంది. చిన్నహీరోలు, కొత్త హీరోల నుంచి సీనియర్‌స్టార్స్‌, లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలలో కూడా ఈ అమ్మడు బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో నయనతార తాజాగా తాను విఘ్నేష్‌శివన్‌ని వివాహం చేసుకోనున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేసింది. ఈ మద్య ఆమె చిత్రాలలో పరాయి హీరోలు తన చేతిని కూడా తాకకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కాలా, 2.౦'ల తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసేముందు చివరి చిత్రంగా సన్‌పిక్చర్స్‌ సంస్థలో మారన్‌ నిర్మాతగా 'పిజ్జా' ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన దీపికాపడుకోనే, త్రిష, అంజలిలపేర్లు తెరమీదకి వచ్చాయి. అయితే ఈ ముగ్గురి విషయంలో ఎవ్వరూ సంతృప్తికరంగా లేరు. 'కొచ్చాడయాన్‌' చిత్రంలో రజనీ, దీపికాపడుకోనేతో నటించగా ఈచిత్రం డిజాస్టర్‌ అయింది. ఇక ప్రస్తుతం దీపికా చాలా బిజీగా ఉంది. ఇక త్రిష ఫేడవుట్‌ అయిన భామ మాత్రమే కాదు.. ఇటీవల సామి2 విషయంలో పలు వివాదాలకు కారణమైంది. ఇక అంజలిది రజనీ పక్కన నటించే స్థాయి కాదు. దాంతో ఇందులో హీరోయిన్‌గా నయనతారనే తీసుకుంటే ఈ చిత్రానికి బిజినెస్‌పరంగా కూడా మంచి క్రేజ్‌ వస్తుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట...! 

Nayanthara in Rajinikanth's Movie:

<span>Nayanthara In Superstar Rajinikanth Next Movie With Karthik Subbaraj</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs