Advertisement
Google Ads BL

పల్లవికి ఏమైంది..!


సాయిపల్లవి పేరు వింటే చాలు దక్షిణాదిలోని అన్ని భాషల వారు ఆమెని ఇష్టపడుతున్నారు. ఆమె నటనకు, డ్యాన్స్‌లకు, డైలాగ్‌ డెలివరికీ ఫిదా అవుతున్నారు. ఒక్కసారి ఆమె సినిమా చూసినవారు ఆమెకి అభిమానులు కాకుండా పోవడం సాద్యం కాదు. అంతలా తన నటనతో ఈమె మెప్పిస్తోంది. ఈమెని ఉద్దేశించే 'ఫిదా' చిత్రం సమయంలో వరుణ్‌తేజ్‌ సాయిపల్లవి వస్తోంది... మిగిలిన హీరోయిన్లు జాగ్రత్త అని చెప్పేంతగా ఆమె హవా సాగుతోంది. 'ప్రేమమ్‌'లో మల్లార్‌ బ్యూటీ 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ఇక ఆ తర్వాత యావరేజ్‌కంటెంట్‌తో రూపొందిన 'ఎంసీఏ' చిత్రంలో కూడా ఈమె నానికి గట్టి పోటీనే ఇచ్చింది. ఇక ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే సాయిపల్లవి సమయానికి షూటింగ్‌కి రాకుండా నిర్మాత దిల్‌రాజు, హీరో నానిలను ఇబ్బందులు పెడుతోందని వార్తలు వచ్చాయి. కానీ వాటిని దిల్‌రాజు, నానిలు కొట్టిపారేశారు. ఇక ఈమె నాగశౌర్యతో లైకా ప్రోడక్షన్స్‌ బేనర్‌లో ద్విభాషా చిత్రంగా రూపొందిన 'కణం' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో సాయిపల్లవి నుంచి యూనిట్‌కి, తనకి ఎంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని, సాయిపల్లవి బిహేవియర్‌ తట్టుకోవడం ఎవరి వల్ల కాదని, ఆమె తన ఇష్టానుసారం డోంట్‌ కేర్‌ అన్నట్లు ప్రవర్తిస్తోందని నాగశౌర్య అన్నాడు. 

దాంతో సాయిపల్లవి నేను కావాలని ఎవరినీ ఇబ్బందిపెట్టలేదు. కావాలంటే దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ని అడగండి... నేను కూడా దర్శకునికి ఫోన్‌ చేసి నా వల్ల మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? అంటే అదేమీ లేదని డైరెక్టర్‌చెప్పాడని చెప్పుకొచ్చింది. ఇక ఈచిత్రం ప్రమోషన్స్‌కి నాగశౌర్య అటెండ్‌ కాకపోవడం జరగడంతో ఇది పెద్ద వ్యవహారమే అని తేలింది. ఇక తాజాగా ఆమె 'నీది నాది ఒకే కథ' చిత్ర దర్శకుడు వేణు దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ పాత్ర చేయడానికి రెడీ అయింది. అదే సమయంలో ఆమెకో షాక్‌ తగిలింది. తమిళ నటుడు, హీరో, దర్శకుడు శాంతన్‌ భాగ్యరాజా ప్రస్తుతం ఓ లేడీ ఓరియటెండ్‌ చిత్రం తీస్తున్నాడు. ఇందులో ముఖ్యపాత్రలకి నిత్యామీనన్‌, సాయిపల్లవిని తీసుకున్నాడు. కానీ ఉన్నట్లుండి ఈ చిత్రం నుంచి సాయిపల్లవిని తప్పించి ఆ స్థానంలో సమంతని పెట్టుకున్నారని సమాచారం. మొత్తానికి ఇలాంటివన్నీ వింటుంటే సాయిపల్లవి బిహేవియర్‌పై అందరికీ అనుమానాలైతే బలపడ్డాయని చెప్పవచ్చు. 

Sai Pallavi Behavior On Sets:

Negative Talk On Sai Pallavi Behaviour
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs