Advertisement
Google Ads BL

అఖిల్ కి జోడిగా నితిన్ హీరోయిన్?


క్రికెట్ లో టాప్ లో ఉండే కుర్రోడు సినిమాల మీద ప్రేమతో హీరో అయ్యాడు. మరి హీరోగానే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేసి స్టార్ హీరో అవుదామనుకుంటే.... మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్నాడు. మరి ఆ హీరో ఎవరో మీకీపాటికే అర్ధమై ఉండాలిగా.. అతనేనండీ నాగార్జున చిన్న కొడుకు అఖిల్. అఖిల్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అఖిల్ హలో సినిమాతో యావరేజ్ టాక్ అందుకున్నాడు. మొదటి సినిమాలో సాయేషా సైగల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అఖిల్ రెండో సినిమాలోనూ కొత్త హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి ని హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసాడు.

Advertisement
CJ Advs

హలో సినిమా తర్వాత ప్రస్తుతం అఖిల్ బివి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మూడో సినిమాని మొదలెట్టేసాడు ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మొత్తం ప్రేమ కథగా ఉండబోతుందని తెలుస్తుంది. మొన్ననే ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ నుండి సెట్స్ మీదకెళుతుంది. హలో సినిమాకి మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. అందుకే మూడో సినిమాని ఎంతో ఆలోచించి ప్రేమకథతో తొలిప్రేమ వంటి హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో అఖిల్, నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్ తో రొమాన్స్ చేస్తాడని తెలుస్తుంది.

లై సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంటర్ అయిన ఈ భామ మొదటి రెండు సినిమాలను నితిన్ సరసనే చేస్తుంది. లై సినిమాతో పాపకి దెబ్బతగిలినా రెండో సినిమా ఛల్ మోహన రంగా తో అయినా హిట్ కొట్టాలని చూస్తుంది. నితిన్ సరసన నటిస్తున్న మేఘ ఆకాష్ కి ఛల్ మోహన రంగా మీద భారీ ఆశలే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఏప్రిల్ ఐదున థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే మేఘన క్యూట్ గా పక్కంటి అమ్మాయిలా అందరిలో కలిసిపోయే అమ్మాయిలా అందరిని ఆకట్టుకునే లక్షణాలు బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మేఘ ఆకాష్ కి ఆఖిల్ తన మూడో సినిమాకి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. మరి ఒకవేళ ఈ సినిమాలో మేఘ ఆకాష్ ఎంపికైతే అటు అఖిల్ కి ఇటు మేఘ కి కూడా ఇది మూడో సినిమానే అవుతుంది.

Megha Akash To Romance Akhil:

Megha Akash To Romance Akkineni Akhil In Venky Atluri Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs