Advertisement
Google Ads BL

నితిన్‌ మంచి ఊపు మీదున్నాడు..!


ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోలలో నాని స్టార్‌స్టేటస్‌ని సాధించాడు. నితిన్‌కి కూడా అటుఇటుగా యంగ్‌స్టార్‌ ఇమేజ్‌ ఉంది. మరోవైపు శర్వానంద్‌, రానా, విజయ్‌దేవరకొండ వంటి వారి హవా కూడా కొనసాగుతూనే ఉంది. ఇక నితిన్‌ ఎంతో ఇష్టపడి, కష్టపడి, భిన్నమైనప్రయత్నంగా 'లై' చిత్రాన్ని హనురాఘవపూడి దర్శకత్వంలో చిత్రం చేసినా 'నేనే రాజు నేనేమంత్రి, జయజానకి నాయకా' చిత్రాల పోటీలో విడుదలై సరిగా ఆడలేదు. అయినా వైవిధ్యభరిత ప్రయత్నం చేశారనే ప్రశంసలు మాత్రం వచ్చాయి. 

Advertisement
CJ Advs

ఇక నితిన్‌ తాజాగా పవన్‌కళ్యాణ్‌, తన సోదరి, త్రివిక్రమ్‌ల భాగస్వామ్యంలో 'చల్‌మోహనరంగ' చిత్రాన్ని తన 25వ చిత్రంగా చేస్తున్నాడు. ఈ చిత్రంలోని పాటలు, ప్రోమోలు, టీజర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కూడా నితిన్‌ సరసన 'లై' చిత్రంలో నటించిన మేఘాఆకాషే నటిస్తోంది. ఇక ఇటీవల జరిగిన వేడుకకు పవన్‌ ప్రత్యేకంగా రావడం విశేషం కాగా... ఈ చిత్రానికి కథను అందించి, నిర్మాణ భాగస్వామి కూడా అయిన త్రివిక్రమ్‌ మాత్రం హాజరుకాలేదు. దాంతో త్రివిక్రమ్‌ ఇంకా 'అజ్ఞాతవాసి' డిజాస్టర్‌ నుంచికోలుకోలేదని, తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో బ్లాక్‌బస్టర్‌ కొట్టి మాత్రమే ఆయన తన సత్తా చాటి మరలా ప్రేక్షకులు ముందుకు రావాలని ఆశిస్తున్నాడని సమాచారం. 

ఇక 'చల్‌మోహనరంగ' చిత్రం ఏప్రిల్‌ 5వ తేదీన విడుదల కానుండగా, ఈ చిత్రంపైమంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం విడుదల దగ్గరపడే కొద్ది నితిన్‌ 'దిల్‌' తర్వాత మరోసారి దిల్‌రాజు నిర్మాణంలో 'శతమానం భవతి' దర్శకుడు సతీష్‌వేగ్నేష్‌ దర్శకత్వంలో 'శ్రీనివాస కళ్యాణం' చిత్రం చేస్తున్నాడు. ఇందులో నితిన్‌కి జోడీగా రాశిఖన్నా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ఎంతో స్పీడుగా జరుగుతోంది. వచ్చేనెల 17వ తేదీ నుంచి చండీఘర్‌లో ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ప్రారంభంకానుంది. కథరీత్యా చండీఘర్‌ లో ఈ కీలక షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. 

ఇక ఏప్రిల్‌ 5న 'చల్‌మోహనరంగ' చిత్రం విడుదల కానుండగా, జులై 24న 'శ్రీనివాస కళ్యాణం' విడుదల కానుంది. అంటే దాదాపు 100 రోజులలోపే నితిన్‌ నటించిన రెండు చిత్రాలు విడుదల కానుండటం, వీటితో అయినా నితిన్‌ మరోసారి 'ఇష్క్‌, గుండెజారిగల్లంతయ్యిందే' వంటి చిత్రాల తర్వాత మరోసారిట్రాక్‌లోకి వస్తాడని, అందునా నితిన్‌కి పవన్‌ ఇచ్చిన ఆశీస్సులతో పవన్‌ ఫ్యాన్స్‌ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నితిన్‌ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.  

Nithin Chal Mohan Ranga And Srinivasa Kalyanam Movie Updates:

Nithin Chal Mohan Ranga And Srinivasa Kalyanam Movie Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs