Advertisement
Google Ads BL

భరత్‌ మాటతప్పక తప్పలేదు.....!


ప్రస్తుతం సోషల్‌మీడియాలో ప్రతి చోటా కొరటాల శివ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌మహేష్‌బాబు, కైరా అద్వానీ జంటగా రూపొందుతున్న 'భరత్‌ అనే నేను' చిత్రం హవా సాగుతోంది. ఏప్రిల్‌ 20న రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్‌ చేసిన సంగతితెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తయింది .రెండు పాటలు పెండింగ్‌లోఉండటంతో మహేష్‌తో పాటు యూనిట్‌ స్పెయిన్‌కి వెళ్లి అక్కడి అందమైన లోకేషన్లలలో ఈ పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను మొదట వైజాగ్‌లో ఏప్రిల్‌ రెండోవారంలో జరపాలని నిర్ణయించారు. తర్వాత ఏపీలోప్రస్తుతం ప్రత్యేకహోదా ఉద్యమం ఉద్దృతంగా ఉన్న నేపధ్యంలో వైజాగ్‌లో ఈ వేడుకను జరిపితే 'రంగస్థలం' వేడుకలో చిరంజీవిని ప్రత్యేకహోదాపై మాట్లాడాలని డిమాండ్‌ వచ్చినట్లుగా మహేష్‌ కూడా ప్రత్యేకహోదా డిమాండ్‌పై మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడిఉండేది. 

Advertisement
CJ Advs

దాంతో వైజాగ్‌కి కాదని విజయవాడలోని కాజాmటోలప్లాజావద్ద ఉన్న గ్రౌండ్స్‌లో అంటే పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిపిన స్థలంలో ఈ చిత్రంప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించాలని భావించారు. కానీ మహేష్‌ బావ పక్కనే ఉన్న గుంటూరుకి ఎంపీగా ఉన్నాడు... సో.. విజయవాడలో ఈ వేడుకను జరిపినా ఇబ్బందులు తప్పవని యూనిట్‌ గ్రహించింది. ఎట్టకేలకు ముందుగా సినీ జోష్‌ చెప్పినట్లే హైదరాబాద్‌లోనే ఈ వేడుకను చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం వేడుక ఏప్రిల్‌ రెండో వారంలో ఉంటుందని వస్తున్న ప్రచారానికి కూడా యూనిట్‌ చెక్‌ పెట్టింది. 

ఏప్రిల్‌ 7వ తేదీనే ఈ వేడుకను జరపాలని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం స్టార్‌హీరోలే కాదు.. సినీ పరిశ్రమమొత్తం దాదాపుగా ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో తమకేమీ సంబంధంలేనట్లుగా, అసలు ఏపీకి తమకి సంబంధమే లేదన్నట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎంత రాజకీయాలు సరిపడవని చెప్పినా కూడా తెలంగాణ విషయంలో జై కొట్టి, అనుకూలంగా సినిమాలు కూడా తీసిన టాలీవుడ్‌ ఏపీపై సవతితల్లి ప్రేమను చూపుతోందనే విమర్శలు వస్తున్నాయి.

Mahesh Babu No Competition for Pawan's Politics:

<span>Bharat Ane Nenu has shifted the audio launch venue to Hyderabad</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs