Advertisement
Google Ads BL

ఇంతకీ ఈ తోట రాముడు ఎవరో తెలుసా.....?


తాను హీరోని కాకుండా ఉంటే రైతునైపోయి హాయిగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడినని పవన్‌కళ్యాణ్‌ చాలా సార్లు చెప్పాడు. ఇక తనకి నటన మీద ఆసక్తిలేదని,కేవలం తను బతకడంకోసం డబ్బుల కోసం సినిమాలు చేస్తున్నానని కూడా అన్నాడు.ఇక ఈయన తన ఫాంహౌస్‌లో చెట్లు, మొక్కలు పెంచుతూ సేంద్రియ ఎరువులతో మామిడికాయల నుంచి ఎన్నో పండ్లు, కూరగాయలు పండిస్తూ ఉంటాడు. అలా ఆయన తన ఫామ్‌హౌస్‌లో చేసే వ్యవసాయానికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తూఉంటాయి. ఇక పవన్ తన తోటలోని మామిడిచెట్లకు కాసే మామిడికాయలను తనకి నచ్చిన వారికి బహుమతిగా పంపుతూ వస్తుంటాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు వేసవికాలం రావడంతో పవన్ ఈసారి ఎవరెవ్వరికి మామిడికాయలు పంపుతాడో వేచిచూడాల్సివుంది... ఇక వేరే ఎవరైనా హీరోలయితే హీరో తనకు సినిమాకి సినిమాకి మద్య గ్యాప్‌ దొరికితే తాను నటించాలనుకుంటున్న స్క్రిప్ట్స్‌ని వినడమో,చదవడమో చేసుకుంటూ ఉంటారు. కానీ పవన్‌ మాత్రం దానికి విరుద్దం. ఆయన సినిమా సినిమాకి మద్య గ్యాప్‌లో పంటలు పండిస్తూ, తోటలో పనిచేస్తూ ఉంటాడు. దాంతో ఆయనకు 'తోటరాముడు' అనే నిక్‌నేమ్‌ కూడా వచ్చేసింది. ఇంతకీ ఈయనకున్న 'తోటరాముడు' అనే నిక్‌నేమ్‌నిపెట్టింది ఎవరో కాదు. ఆయన చిన్న అన్నయ్య నాగబాబే ముద్దుగా ఆయనకు తోటరాముడు అనే పేరు పెట్టాడు. ఈ విషయాన్ని పలు సందర్భాలలో తెలిపాడు. తాజాగా నాగబాబు మరోసారి పవన్‌ని తోటరాముడిగా సంబోధించడం అనేది  జరగడంతో ఈ వార్త ప్రస్తుతం అన్ని చోట్లా వైరల్‌ అవుతోంది. మొత్తానికి పవన్‌లో మూడు వేరియేషన్స్‌ ఉన్నాయన్నమాట. ఏవ్.. హీరో,రాజకీయనాయకుడు, తోటరాముడు. 

Is Pawan Kalyan Thota Ramudu? :

<span>Mega Brother Naga Babu addresses&nbsp;</span><a class="tagLinkInText" title="Find Pawan Kalyan news and other pages here" href="http://www.cinejosh.com/tag/1/1/pawan-kalyan.html">p</a>awan kalyan<span>&nbsp;as Thota Ramudu</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs