Advertisement
Google Ads BL

మెగా పిక్ అదిరింది!!


నిన్న మంగళవారం రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు అటు మెగా ఫ్యామిలీ, ఇటు మెగా ఫాన్స్ ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. రామ్ చరణ్ భార్య అయితే మిస్టర్ సి కి ఇచ్చిన సర్ప్రైజెస్ అన్ని ఇన్ని కావు. రంగస్థలం సినిమా ప్రమోషన్స్ తోపాటుగా రామ్ చరణ్ తన పుట్టిన రోజుని ఎంతో ఘనంగానే  జరుపుకున్నాడు. అయితే అన్నిటిలో రామ్ చరణ్ బర్త్ డే రోజున ఒకే ఒక ఫోటో మాత్రం విపరీతంగా హైలెట్ అయ్యింది. అదేమిటంటే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పుట్టిన రోజున మెగాస్టార్ చిరు ఇంటికి రావడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న మెగా మేటర్.

Advertisement
CJ Advs

పవన్ కళ్యాణ్ ఈమధ్యన మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధమే కొనసాగిస్తున్నాడు. గతంలో అంటీముట్టనట్లుండే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఈమధ్యన చిరుపై కుదిరినప్పుడల్లా ప్రేమ కురిపిస్తున్నాడు. వాళ్ళ మధ్యలో మంచి అనుబంధం ఎప్పుడు ఉండొచ్చు గాని బయటికొచ్చినప్పుడు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడంతో మీడియా కూడా రెచ్చిపోయి మెగా ఫ్యామీలపై అనేక రకాల న్యూస్ లు ప్రసారంచేయ్యడం  మెగా ఫ్యామిలిలో లుకలుకలున్నాయంటూ వార్తలు రాయడం జరిగేది.

అయితే ప్రస్తుతం తనకు పుట్టిన కొడుకు చిరంజీవి ఒరిజినల్ పేరిట శివ శంకర్ వరప్రసాద్ లో  తన కొడుక్కి శంకర్ అనే పేరు కలిసేట్టుగా పెట్టి అన్న మీద ప్రేమ చాటడం.... అలాగే తన వదినమ్మ సురేఖ తో నరేంద్ర చౌదరి పెళ్ళిలో ఎంతో బాగా కలిసిపోవడం అన్ని ఒక ఎత్తైతే.. పవన్ కళ్యాణ్ నిన్న తన అన్న కొడుకు రామ్ చరణ్ పుట్టినరోజునాడు చిరు ఇంటికొచ్చి మరి చరణ్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి  విష్ చేసి అన్న కొడుకు చరణ్ తో అన్న చిరు, వదినమ్మ సురేఖలతో ఒక అందమైన ఫోటో గ్రాఫ్ కూడా దిగాడు. మరి ఈ పిక్ చూస్తుంటే మాత్రం మెగా అభిమానుల కడుపునిండిపోతుంది అంటే నమ్మాలి మరి.

Pawan Visits Chiru Home For Ram Charan Birthday:

Pawan Kalyan Attends Ram Charan Birthday Celebrations At Home
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs