Advertisement
Google Ads BL

అమితాబే.. సైరా లుక్ లీక్ చేశాడు!


చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పలు భాషల్లో విడుదలకు  ప్లాన్ చెయ్యడంతో పాటుగా వివిధ భాషల నటీనటులను ఈ చిత్రం కోసం ఎంపిక చేశారు. నయనతార హీరోయిన్ గా, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా ఒక కీ రోల్ లో కనబడనున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ని స్టార్ చేసుకుంది.

Advertisement
CJ Advs

ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ హీరో అమితాబచ్చన్, నయనతార కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈ చిత్రంలో చిరంజీవికి అంటే సైరా నరసింహారెడ్డి గురువుగా కనిపించబోతున్న అమితాబ్ లుక్ బయటికి వచ్చింది. అది లీక్ చేసింది కూడా అమితాబచ్చన్. తానూ మరికొన్ని గంటల్లో సైరా షూటింగ్ లో పాల్గొనడానికి ముంబై నుండి బయలుదేరుతున్నానని.. సైరా నరసింహారెడ్డి లో నా లుక్ ఇలానే.. ఇప్పుడు మీరు చూస్తున్న లుక్ కి దగ్గరలోనే ఉండబోతుందని.. కానీ... ఈ లుక్ ఇంకా ఫైనల్ కాదని.. కేవలం టెస్ట్ కోసమే అంటూ ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

ఈ లుక్ లో అమితాబచ్చన్ తెల్లని గుబురు గడ్డంలో, మీసాలతో కురువృద్ధుడిగా కనిపిస్తున్నాడు. మరి ఈ లుక్ లో నిజంగానే చిరుకి గురువు అమితాబ్ అని అందరూ ఫిక్స్ అయ్యేలా వుంది. నిజంగానే టెస్ట్ పిక్కే ఇలా ఉంటే ఒరిజినల్ లుక్ ఇంకెలా ఉంటుందో కదా. మరి అమితాబ్ ఇంకా ఆ ట్వీట్ లో తనకెంతో ఇష్టమైన స్నేహితుడు చిరంజీవి ఎంతో సాహోసోపేతమైన రోల్ లో సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నాడని...అలాగే ఇంత గొప్ప చిత్రంలో తనని కూడా నటించమని అడుగగా.. నేను ఒప్పేసుకున్నానని  కూడా చెప్పాడు అమితాబ్.

Big B posted his look in Sye Raa:

Bib B leaked his look in sye raa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs