రాజమౌళి మేకింగ్ అంటే ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఆయన తెరకెక్కించే సినిమా అంతా.. పర్ఫెక్ట్ గా ఉందొ లేదో చూసుకున్నాకే సినిమా షూటింగ్ కి ఒక కంక్లూజన్ ఇస్తాడు. అందుకే ఏళ్లతరబడి చెక్కుతూనే ఉంటాడు. ఎక్కడిదాకో ఎందుకు బాహుబలి పార్ట్ 1 ని రెండేళ్లపాటు చెక్కిన జక్కన్న బాహుబలి పార్ట్ 2 ని మూడేళ్లు చెక్కాడు. మరి ఎన్నేళ్లు చెక్కినా దాని ఫలితం మాత్రం ఒక లెవల్లో ఉంటుంది. అందుకే రాజమౌళితో పనిచేసే హీరోలెవరు జక్కన్న షూటింగ్ విషయంలో పెద్దగా కలగజేసుకోరు. అదంతా రాజమౌళి మీదున్న నమ్మకం ఒకెత్తయితే. ఆయన మీద ఉన్న గౌరవం మరో ఎత్తు.
అయితే ఇప్పుడు బాహుబలిలా చారిత్రాత్మక చిత్రం కాకుండా ఒక సింపుల్ కథతో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి మల్టీస్టారర్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే #RRR అంటూ అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే రాజమౌళి ఈ సినిమాని ఎలాంటి కథతో తియ్యబోతున్నాడో అనేది మాత్రం అస్సలు క్లారిటీ లేదు. ఏవో రకరకాల కథలు గాసిప్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేసినా అందులో నిజమెంతుందో రాజమౌళికే తెలియాలి. ఎందుకంటే రామ్ చరణ్ అయితే తనకి ఇంతవరకు రాజమౌళి స్టోరీ లైన్ కూడా చెప్పలేదని.. కేవలం మనం సినిమా చేస్తున్నామనే రాజమౌళి గారు చెప్పాడని చెబుతున్నాడు. మరో పక్క ఎన్టీఆర్ అయినా అంతే.
అయితే రాజమౌళి తెరకెక్కించబోయే ఈ సినిమా తాను ఇప్పటివరకూ టచ్ చేయని ఓ కొత్త థీమ్ ను పట్టుకున్నాడని.. దానిపైనే సినిమా తీయబోతున్నాడనే టాక్ మాత్రం గట్టిగానే ఉంది. సైన్స్ ఫిక్షన్ సినిమా తీస్తున్నాడని కొందరు చెబుతుంటే.. మరికొందరు ఫ్యాంటసీ ఫిలిం అంటున్నారు. అయితే ఈ సినిమా మాత్రం రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ లో తియ్యబోతున్నాడని.. ఇక ఈ సినిమాని కూడా బాహుబలి మాదిరిగా కనీసం మూడేళ్ళ టైం జక్కన్న తీసుకుంటాడని అనుమానం ఇప్పుడు అందరిలో కలుగుతుంది. మరి ఈ మూడేళ్లు చరణ్ గాని, ఎన్టీఆర్ గాని మరో మూవీ ఒప్పుకోకుండా ఈ మల్టీస్టారర్ కే అంకితమైపోవాలేమో.