Advertisement
Google Ads BL

రవితేజ క్రేజ్ ఈ డీల్ ద్వారా అర్ధమవుతుంది!!


బెంగాల్ టైగర్ తర్వాత దాదాపుగా రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఒకేసారి రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు సినిమాలను రవితేజ లైన్ లో పెట్టాడు. ఆ రెండు సినిమాల్లో అనిల్ రావిపూడి తో చేసిన రాజా ది గ్రేట్ సినిమా హిట్ అయితే... విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వచ్చిన టచ్ చేసి చూడు సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. దానితో రవితేజ మార్కెట్ కూడా పడిపోతుంది అనుకున్నారు అంతా. కానీ రవితేజ మాత్రం తన స్పీడు తగ్గించలేదు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ తో నేల టిక్కెట్ సినిమాతో పాటుగా శ్రీను వైట్ల తో కలిసి మరో మూవీ ని లైన్ లో పెట్టాడు.

Advertisement
CJ Advs

కళ్యాణ్ కృష్ణ - రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న నేల టిక్కెట్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద క్రేజ్ కూడా భారీగానే ఉంది. ఆ క్రేజ్ తోనే రవితేజకు ఇంతకు ముందు ప్లాప్ ఉన్నా ప్రస్తుతం నేల టిక్కెట్ విషయంలో ఉన్న క్రేజ్ తోనే నేల టికెట్ శాటిలైట్ రైట్స్ తోపాటు... డిజిటల్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ కి గట్టిపోటీ ఏర్పడిందనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అందులో భాగంగానే ఒక టీవీ ఛానల్ వారు నేల టికెట్ శాటిలైట్స్ హక్కులను, డిజిటల్ హక్కులను,  హిందీ అనువాద హక్కులను కలిపి అదిరిపోయే రేటుకి అంటే  25 కోట్లు సొంతం చేసుకుందట. 

మరి కుటుంబ మరియు కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచాలున్నాయో ఈ రేటుని బట్టి అర్ధమవుతుంది.  రవితేజకి ప్లాప్స్ ఉన్నా అతనికున్న క్రేజ్ ఈ డీల్ ద్వారానే అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమా హక్కులకు ఈ రేటు పలకడంతో నేల టిక్కెట్ నిర్మాతలకు బంపర్ ఆఫర్ తగిలిందనే చెప్పాలి.

Ravi Teja/’s producer hits a jackpot:

Nela Ticket digital, satellite and Hindi rights have been sold jointly for a whopping 25 Crores.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs