Advertisement
Google Ads BL

‘రంగస్థలం’ బిజినెస్.. చరణ్‌కే షాకిస్తుంది..!


రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం మరో మూడు రోజుల్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమవుతుంది. ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఒక పక్క వీర లెవల్లో జరుగుతుంటే మరో పక్క రంగస్థలం ప్రమోషన్స్ కూడా అంతే పీక్స్ లో ఉన్నాయి. సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ రంగస్థలంపై భారీ అంచనాలే ఉన్నాయి. వేసవి సెలవలకి ముందుగా ఓ భారీ బడ్జెట్ చిత్రంతో రామ్ చరణ్  బాక్సాఫీసు వద్ద బోణీకి సిద్దమవుతున్నాడు. ఈ సినిమాపై మొదటినుండి విపరీతమైన హైప్ ఉంది. రామ్ చరణ్, లుక్, సమంత పల్లె పడుచు అందాలు ఇలా అన్నింటిలో భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం భారీ బిజినెస్ ని అంటే రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకుంది.

Advertisement
CJ Advs

దాదాపుగా రామ్ చరణ్ రంగస్థలం అన్ని హక్కులు కలిపి 112 కోట్ల బిజినెస్ జరగడం రామ్ చరణ్ కెరీర్ లోనే మొదటిసారి. చరణ్ కెరీర్ లోనే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసిన తొలి సినిమా రంగస్థలం కావడం విశేషం. అసలు రంగస్థలం థియేట్రికల్ హక్కులే దాదాపుగా 80 కోట్లు పలికాయి. రంగస్థలంకి సంబంధించి ప్రతి ఏరియాలోనూ చరణ్ కెరీర్లో అత్యధిక రేటు పలికిందీ అంటే విశేషంగానే చెప్పాలి మరి. ఇక రామ్ చరణ్ రంగస్థలంకి నైజాంలో ఏకంగా18 కోట్లకు అమ్ముడుపోగా...సీడెడ్ రైట్స్ 12 కోట్లకు..... ఆంధ్రాలో మిగతా ఏరియాలన్నీ కలిపి దాదాపు 32 కోట్లు పలికాయి. మరి ఈ రేంజ్ లో థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోతే... ఇంకా ఓవర్సీస్ రైట్స్ కూడా దాదాపు 9 కోట్లకు అమ్ముడుపోయాయి.

అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ 10.5 కోట్లు, తెలుగు బ్రాడ్ కాస్ట్ రైట్స్ ద్వారా 20 కోట్లు, కర్ణాటక హక్కులు 7.6 కోట్లు తో పాటు ఇతర ఆదాయాలతో పాటు మొత్తంగా రంగస్థలానికి 112 కోట్లు వచ్చాయన్నమాట. ఇక తాజాగా రంగస్థలానికి సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ని జారీ చేశారు. మరి ఈ లెక్కన అంటే సెన్సార్ రిపోర్ట్ తో పాటు రంగస్థలం బిజినెస్ చూస్తుంటే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయి చిటికెలో చెప్పెయ్యొచ్చన్నమాట.

Shocking Pre Release To Ram Charan Rangasthalam:

Rangasthalam Pre Release Business Crossed 100 Crores
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs