రామ్ చరణ్ ప్రస్తుతం తన తాజా చిత్రం రంగస్థలం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా వున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం మీడియా వారికీ రంగస్థలం ఇంటర్వూస్ ఇస్తున్నాడు. అయితే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రంగస్థలం కబుర్లతో పాటు రామ్ చరణ్ తాను రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే మల్టీస్టారర్ కి సంబందించిన విషయాలను మాట్లాడాడు.
సదరు యాంకర్ రామ్ చరణ్ ని చివరి ప్రశ్న మిమ్మల్ని నేను అడగకపోతే ఫాన్స్ నన్నూరుకోరు అంటూ #RRR రామారావు, రామ్ చరణ్, రాజమౌళి సినిమా గురించి చెప్పండి. రాజమౌళి చెయ్యబోయే మల్టీస్టారర్ విషయాలు చెప్పండి. అసలు రాజమౌళి మీరు ఎలాంటి కథతో సినిమా చెయ్యబోతున్నారు. ఏ జోనర్ లో ఉంటుంది అని అడగగా... దానికి చరణ్ నవ్వుతూ నేను ఇక్కడికి వచ్చేముందే రాజమౌళి తనకి మెస్సేజ్ చేశారని.. అందులో చరణ్ నువ్వు రంగస్థలం మూవీ ప్రమోషన్స్ లో పలు ఇంటర్వూస్ లో పాల్గొనడానికి వెళుతున్నావని విన్నాను. అందులో మన సినిమా గురించి ఎలాంటి విషయాలు బయట పెట్టకు అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా సదరు యాంకర్ కి చరణ్ నవ్వుతూ చెప్పాడు. మరి నిజంగానే రాజమౌళి, చరణ్ కి అలానే చెప్పుంటాడు. ఎందుకంటే ఎప్పుడో మొదలవ్వబోయే సినిమా విషయాలు ఇప్పుడే బయటికి వస్తే ఆ తర్వాత చెప్పడానికి ఏం ఉండవు కదా.. అది మేటర్.