#RRR అని అలా డివివి దానయ్య అధికారికంగా ప్రకటించాడో లేదో.. ఈ సినిమాపై అప్పుడే అటు ట్రేడ్ వర్గాల్లోనూ ఇటు ప్రేక్షకులల్లోను విపరీతమైన ఆసక్తే కాదు అంచనాలు పెరిగిపోయాయి. అయితే రామారావు, రామ్ చరణ్, రాజమౌళిల మల్టీస్టారర్ సినిమా గురించిన అనేక రకాల గాసిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని ఒకసారి, కాదు కాదు పోలీస్ ఆఫీసర్స్ గా అని, మళ్ళీ మల్ల యుద్ధం చేసే మల్ల యోధులుగా కనబడతారనే ప్రచారం మమూలుగా జరగలేదు. గత మూడు నెలలుగా ఈ మల్టీస్టారర్ పై రోజుకో న్యూస్ మీడియాలో హల్చల్ చేసింది.
అసలు రాజమౌళితో సినిమా అనగానే ఎన్టీఆర్, చరణ్ లు మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నారట. ఇలా చెప్పింది ఎవరో కాదు రంగస్థలం ప్రమోషన్స్ లో బిజీగా వున్న రామ్ చరణ్. అవునండి రామ్ చరణ్ రంగస్థలం ఇంటర్వూస్ లో ఒక యాంకర్ మీ #RRR ముచ్చట్లు చెప్పమని అడగగానే.. అసలు రాజమౌళి మాకేం చెప్పనే లేదు. అసలు రాజమౌళి మాకెలాంటి స్టోరీ లైన్ వినిపించకుండా మీకేం చెప్పమంటారు. కేవలం మనం సినిమా చేస్తున్నాం అని చెప్పారు.. మేము హ్యాపీగా ఒప్పేసుకున్నాం అంటూ కూల్ గా సమాధానం చెప్పాడు.
మరి ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి రాజమౌళి అంటే ఎంతిష్టమో వేరే చెప్పక్కర్లేదు. అందులో టాప్ డైరెక్టర్ రాజమౌళి మనం సినిమా చేద్దామంటేనే చాలు ఇక స్టోరీ ఏంటి, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆలోచన పెట్టుకోవక్కర్లేదు. ఎందుకంటే రాజమౌళి అలాంటి ఛాన్స్ ఇవ్వడు. కథ పక్కాగా ఉంటేనే సినిమాని పట్టాలెక్కిస్తాడు. లేదంటే అస్సలు సినిమానే చెయ్యడు. అందుకే ఈ స్టార్ హీరోలు స్టోరీ లైన్ చెప్పకపోయినా రాజమౌళి సినిమాని ఒకే చేశారు చరణ్ అండ్ ఎన్టీఆర్ లు.