Advertisement
Google Ads BL

శ్రీదేవి ఇంట పెళ్లిబాజాలు..!


స్వతంత్య్రదేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్‌ అని ఓ కవి అన్నాడు. ఇది నిజమే.. మనిషి మరణించిన కొన్ని రోజులు అదే వేదనతో గడుపుతారు. కానీ కాలం అనేది అన్ని గాయాలను మాన్పుతుంది. కాలగమనంలో తాము కోల్పోయిన వారిని గుర్తుపెట్టుకోలేనంతగా, తమ తమ పనుల్లో బిజీ అయిపోతారు. అదే లోక చిత్రం విచిత్రం. ఇక అతిలోక సుందరి శ్రీదేవి మరణం దేశయావత్తు కన్నీరు పెట్టేలా చేసింది. అందరు ఆ వార్త విని షాక్‌కి గురయ్యారు. కొందరు ఇప్పటికీ ఆ షాక్‌ నుంచి కోలుకోవడం లేదు. మనం విన్నవార్త నిజం కాదేమో... కలేమో అనే పరిస్థితుల్లో ఉన్నారు. మరి దేశ ప్రజలనే ఇంత విషాదంలో ముంచిన ఈ సంఘటన కపూర్‌ ఫ్యామిలీని మరెంతగా బాధపెట్టి ఉంటుందో అర్ధమవుతోంది. ఇక అందునా ఆమె మృతి తర్వాత ఆమె మరణంపై వచ్చినన్ని కథనాలు మరెవ్వరికీ రాలేదు. అది కూడా బోనీ ఫ్యామిలీని కలత చెందేట్లు చేసి ఉంటుంది. 

Advertisement
CJ Advs

ఇక ఈ మరణవార్త నుంచి ఇప్పుడిప్పుడే కపూర్‌ ఫ్యామిలీ బయటపడుతోంది. తమ పెద్ద కోడలు మరణాన్ని జీర్ణించుకుని త్వరలో ఓ శుభకార్యం ద్వారా ఆ విషాదాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది. విషయానికి వస్తే బోనీకపూర్‌ సోదరుడు, శ్రీదేవి మరిది, నిన్నటితరం స్టార్‌ అనిల్‌కపూర్‌ కూతురు ప్రముఖ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌కపూర్‌ అన్న విషయం తెలిసిందే. ఈమె 2008లో 'సావరియా' చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2016లో వచ్చిన 'నీర్జా' చిత్రానికి గాను జాతీయ అవార్డును సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో అక్షయ్‌కుమార్‌ 'ప్యాడ్‌మెన్‌'తో ఆకట్టుకున్న ఈమె నటించిన 'వీరే ది వెడ్దింగ్‌, సంజు, ఏక్‌ లడ్‌కీకో దేకాతో ఐసా లగా' వంటి చిత్రాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. ఈమె తన బోయ్‌ఫ్రెండ్‌, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహూజాతో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. ఎట్టకేలకు జూన్ 11, 12 తేదీలలో వీరి పెళ్లి జెనీవాలో జరగనుందని సమాచారం. ఈ మేరకు రెండు కుటుంబాల వారు ఏర్పాట్లు చేస్తున్నారు. అతిధులను వివాహ వేదికకు తరలించేందుకు ఫ్లైట్‌ టిక్కెట్స్‌ వంటివి కూడా బుక్‌ చేయడం జరుగుతోందని తెలుస్తోంది. మరి ఈ వేడుక అయినా బోనీ ఫ్యామిలీలో మరలా పాత ఉత్సాహాన్ని రేపుతుందో లేదో వేచిచూడాల్సివుంది....!

Sonam Kapoor is Planned Marriage with her Boyfriend :

Sonam Kapoor and Anand Ahuja to have a June wedding? 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs