Advertisement
Google Ads BL

చెన్నకేశవ రెడ్డి తర్వాత మళ్లీ.. త్వరలో..?


బాలకృష్ణ మామూలోడు కాదు బాబోయ్. సైలెంట్ గా తన పనులు చేసుకుపోతూ అందరికి షాకుల మీద షాకులిచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ని రేపో మాపో పట్టాలెక్కించబోతున్న బాలకృష్ణ బోయపాటితో సినిమా అంటున్నారు. బోయపాటితో కలిసి 2019 ఎన్నికల సమయానికల్లా ఒక సినిమా చేయాలనుకోవడం.... బోయపాటి ఆ సినిమా విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. మరో పక్క కన్నడలో హిట్ అయిన మఫ్టీ సినిమాని తెలుగులో బాలకృష్ణ రీమేకే చేస్తాడనే ప్రచారం ఉంది. మరి రెండు మూడు సినిమాలు లైన్ లో ఉంచిన బాలకృష్ణ తాజాగా వినాయక్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాణంలో మరో మూవీకి ఒకే చేశాడు.

Advertisement
CJ Advs

ఈ సినిమా మే 27 న ఓపెనింగ్ కూడా జరుపుకోబోతుంది. ఇది పక్కా.. ఎందుకంటే ఈ సినిమాని  నిర్మించబోయే సి కళ్యాణ్ ఈ విషయాన్నీ ప్రకటించాడు. మరి బాలయ్య జోరు మాములుగా లేదు గాని... అసలు ఇలా ఒక అట్టర్ ప్లాప్ డైరెక్టర్ వి వి వినాయక్ కి ఇప్పుడు బాలయ్య అవకాశం ఇవ్వడం ఏమిటంటూ ఫిలింనగర్ లో గుసగుసలు. ఎందుకంటే వినాయక్ తాజాగా సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ఇంటిలిజెంట్ ఫలితం ఎలా ఉందో తెలిశాక కూడా బాలయ్య ఇలా వినాయక్ కి అవకాశం ఇవ్వడం ఏమిటి అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. మరి బాలయ్యకి ఇలా ప్లాప్ దర్శకులకి అవకాశం ఇవ్వడం కొత్తేమి కాదు.

ఇంతకుముందు పైసా వసూల్ తో పూరి జగన్నాద్ కి, జై సింహాతో రవికుమార్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వినాయక్ కి మరి.. బాలయ్యకి వినాయక్ చెప్పిన కథ అంతలా నచ్చిందా... అసలు వినాయక్ ట్రాక్ రికార్డు ఈమధ్య అస్సలేం బాగోలేదు. మరి బాలకృష్ణ మాత్రం అదేమీ పట్టించుకోకున్నా ఇలా వినాయక్ కి అవకాశం ఇచ్చేశాడు. మరి నిజంగా ఇది వినాయక్ అదృష్టమని చెప్పాలి. ఇంటిలిజెంట్ సినిమాతో కొత్తగా ట్రై చెయ్యకుండా ఇంకా పాతకాలపు సినిమాలాంటి సినిమాని తెరకెక్కించాడని తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు వినాయక్. ఇలాంటి టైంలో బాలయ్యతో వినాయక్ సినిమా అంటే వినాయక్ కి కలిసొచ్చే అంశమే.

Balakrishna and VV Vinayak Combo Soon:

Balakrishna New Movie with VV Vinayak
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs