Advertisement
Google Ads BL

భరత్ సాంగ్ లోనే హామీ ఇచ్చేశాడు..!


తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ చేస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ సినిమాలో మొదటి సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘విరచిస్తా నేడే నవశకం-నినదిస్తా నిత్యం జనహితం' అంటూ సాగే ఈ పాట తన చక్కని పదాలతో రామజోగయ్య శాస్త్రి రాశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు చాలా క్లాసికల్ గా ట్యూన్ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

'భరత్ అను నేను హామీ ఇస్తున్నాను' అంటూ పాట ఆద్యంతం డేవిడ్ సైమోన్ గొంతులో చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఖైదీ నెంబర్ 150 లో నీరు నీరు పాట ద్వారా ఎమోషనల్ గా టచ్ చేసిన రామజోగయ్య శాస్త్రి మరోసారి అలాంటి ఘనత ఈ పాటతో సాధిస్తారు అనిపిస్తోంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్.. దేవి ట్యూన్..డేవిడ్ సైమోన్ గొంతు.. ఈ పాటను వేరే స్థాయికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.

మెలోడీగా సాగే ఈ పాట సినిమాలో ఓ కీలక సన్నివేశం వస్తుందని అంటున్నారు. మొత్తానికి భరత్ విజన్ అంటూ వదిలిన మొదటి పాట అంచనాలు నిలబెట్టుకునేలా ఉంది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇక మరి ఈ సాంగ్ ఏ రికార్డును క్రియేట్ చేస్తుందో చూడాలి.

Click here for Bharat Ane Nenu song:

Bharat Ane Nenu Song Report:

Bharat Ane Nenu Song Review  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs