Advertisement
Google Ads BL

మిసెస్‌ నయన్‌ విఘ్నేష్‌.. ఎనీ డౌట్స్‌..?


ఈమధ్య మన దేశంలోని హీరోయిన్లు మూడో కంటికి తెలియకుండా పెళ్లిళ్లు చేసుకుంటూ అబ్బే.. అదేం లేదు అంటూ కళ్లుమూసుకుని పిల్లి పాలు తాగుతున్న విధంగా ప్రవర్తిస్తున్నారు. అనుష్కశర్మ-విరాట్‌కోహ్లి, శ్రియాశరణ్‌, ఇలియానా, శృతిహాసన్‌, ఎమీ జాక్సన్‌ వంటివారు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని మూడో కంటికి తెలియకూడదనే ఉద్దేశ్యంతో సొంతగా ఇళ్లు తీసుకుని కాపురం కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరికొందరు ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోయినా కలిసి మెలిసి ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు.ఇక దీపికాపడుకొనే-రణవీర్‌సింగ్‌, టైగర్‌ష్రాఫ్‌-దిశాపటానీలు కూడా అదే దారిలో ఉన్నారట. మరోవైపు ముందు శింబు, తర్వాత ప్రభుదేవాల చేతిలో మోసపోయిన నయనతార ఈసారి మాత్రం గట్టిగా పెళ్లి ప్రయత్నాలలోనే ఉంది. విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి, నయనతార ముఖ్యపాత్రల్లో వచ్చిన 'నేనుంరౌడీదాన్‌' చిత్రం తమిళనాట మంచి విజయం సాధించింది. ఇదే చిత్రం తెలుగులో 'నేనూ రౌడీనే' అనే పేరుతో డబ్‌ అయి ఫ్లాప్‌ అయింది. ఇక ఇందులో నయనతార మూగమ్మాయిగా నటించింది. ఈ చిత్రానికి గాను నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లకి పలు అవార్డులు వచ్చాయి. ఆమధ్య విఘ్నేశ్‌ శివన్‌కి ఓ అవార్డు వస్తే వేదికపైకి వచ్చి నయనతారనే తనకు అవార్డును ఇవ్వాలని పట్టుబట్టి ఆమె చేతుల మీదుగా అవార్డును తీసుకున్నప్పుడే విషయం అర్ధమైంది. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల ఆమె ఎక్స్‌పోజింగ్‌కి, కనీసం హీరోల చేతులు తాకడానికి కూడా ఒప్పుకోవడం లేదు. కావాలంటే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలైనా చేస్తానని, అంతేగానీ రొమాన్స్‌ సీన్స్‌ చేయనని ఖచ్చితంగా చెబుతోంది. ఈ మార్పు కేవలం విఘ్నేశ్‌ శివన్‌తో పెళ్లి వల్లనే అని కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఆల్‌రెడీ వీరిద్దరు ఒకే ఫ్లాట్‌లో కూడా ఉంటున్నారని కోలీవుడ్‌ మీడియా అంటోంది. ఇక ది హిందు పత్రిక ఇచ్చే 'వరల్డ్‌ ఆఫ్‌ ఉమెన్‌ 2018' అవార్డుల వేడుకలో నయనతార నటనలో ఎక్స్‌లెన్స్‌ అవార్డును సాధించింది. ఈ సందర్భంగా ఈ మలయాళ కుట్టీ మాట్లాడుతూ, నాకు ఈ ప్రయాణంలో సహకరించిన తల్లిదండ్రులు, సోదరుడు, తనకు కాబోయే భర్తకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఇన్‌డైరెక్ట్‌గా విఘ్నేశ్‌ శివన్‌ని తాను వివాహం చేసుకోనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. అయితే ప్రస్తుతం కూడా ఆమె కెరీర్‌ బిజీగా ఉండటంతో దానికి ఆటంకం లేకుండా కొద్దికాలం వివాహం వాయిదా వేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఐదారేళ్లు ఇండస్ట్రీలో ఉండటమే గ్రేట్‌ అనుకుంటున్న ఈ రోజుల్లో పుష్కరకాలంపైగా వెలుగొందుతూ, లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార నటించిన 'కర్తవ్యం' అనే డబ్బింగ్‌ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇక ఈమె చిరంజీవి నటించే 'సై...రా..నరసింహారెడ్డి'లో కీలకమైన పాత్రను చేయనుంది.

Nayanthara confirms engagement with Vignesh Shivan:

Nayantara Just Confirmed That Vignesh Shivan Is Her Fiance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs