బాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరు అనగానే వెంటనే దీపికా పదుకొనె పేరే చెబుతారు. మొన్నటివరకు దీపికకు గట్టి పోటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ వెంట పడడంతో ప్రస్తుతం దీపికానే బాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చుంది. అలాంటి దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలను మరో హీరోయిన్ వెనక్కి నెట్టేసి షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో 'స్కోర్ ట్రెండ్స్' సంస్థ వారు చేసిన సర్వేలో అనూహ్యంగా అనుష్క శర్మ మొదటి స్థానాల్లో కూర్చుని దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలకు షాక్ ఇవ్వడమే కాదు అందరి చూపు ఒక్కసారిగా తన మీద పడేలా చేసుకుంది.
సోషల్ మీడియా అంటే పేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ అలాగే న్యూస్ పేపర్స్, డిజిటల్ వేదిక లాంటి ఇతర ప్రసార మాధ్యమాల్లో ఏ హీరోయిన్స్ ని ఎక్కువగా సెర్చ్ చేశారు అనే దాని మీద 'స్కోర్ ట్రెండ్స్' నిర్వహించిన సర్వేలో అనుష్క శర్మ మోస్ట్ పాపులర్ నటిగా అవతరించగా... సెకండ్ ప్లేస్ లో ప్రియాంక చోప్రా, థర్డ్ ప్లేస్ లో దీపికా పదుకొనెలు నిలిచారు. మరి అనుష్క శర్మ ఇంతగా పాపులార్ అవడానికి గల కారణం ఆమె చేస్తున్న సినిమాలతోపాటు క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడడమే అంటున్నారు.
మరి 'స్కోర్ ట్రెండ్స్' సర్వే ప్రకారం హీరోయిన్స్ మార్కులు ఇలా వున్నాయి. అనుష్క శర్మ అందరిని ఆశ్చర్యపరిచేలా 71.90 స్కోరుతో టాప్ లో నిలిచింది. టాప్ 2 లో 50.43 స్కోరుతో ప్రియాంకా చోప్రా, టాప్ 3 లో 40.09 స్కోరుతో దీపికా పదుకునే , టాప్ 4 లో కంగనా రనౌత్ 31.78 నిలవగా మిగతా టాప్ 10 స్థానాల్లో సన్నీ లియోన్, సోనం కపూర్, శ్రద్ధా కపూర్, విద్యాబాలన్, తాప్సీ పన్ను, మాధురీ దీక్షిత్ నిలిచారు.