Advertisement
Google Ads BL

అది పవన్ కోసం రాసుకున్న కథే..!


ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టే ఎన్టీఆర్‌ 'బొబ్బిలిపులి, సర్దార్‌పాపారాయుడు, నాదేశం' వంటి తనకి పొలిటికల్‌ మైలేజ్‌ ఇచ్చే చిత్రాలను ఎంచుకుని మరీ రాజకీయాలలోకి వచ్చే ముందు నటించాడు. ఇక చిరంజీవి కూడా 'ఠాగూర్‌, స్టాలిన్‌' చిత్రాలను పొలిటికల్‌ మైలేజ్‌ కోసమే చేశాడు. కానీ పవన్‌ది వీరిద్దరి కంటే భిన్నమైన వైఖరి. అలాంటి నిర్ణయం పవనే తీసుకున్నాడు. అధికారంలోకి రావడం నా లక్ష్యం కాదు... ప్రశ్నించడమే నా లక్ష్యం... అంటూ ఓవైపు తాను ముఖ్యమంత్రి అయ్యే చాన్స్‌ లేదని కూడా పలుసార్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. ఇప్పటికీ అయన అధికారం తన లక్ష్యం కాదంటున్నాడు. అలాంటి సమయంలో పవన్‌ రాజకీయాలలోకి వస్తున్న సమయంలో తన పొలిటికల్‌ మైలేజ్‌కి కూడా ఉపయోగపడే చిత్రాలు చేసి, తన భావాలను సినిమాల ద్వారా చూపించిన, తర్వాత రాజకీయాలలోకి వచ్చి ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు ఆశపడ్డారు. కానీ అదే సందిగ్దం పవన్‌కి కూడా వచ్చిందని అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

పొలిటికల్‌ మైలేజీ కోసం అలాంటి కథలు చేస్తే తాను కేవలం పదవి మీద కాంక్షతోనే ఈ చిత్రాలు తీశాననే ఇన్‌డైరెక్ట్‌ మెసేజ్‌ ప్రజల్లోకి వెళ్తుందని దానికి నో చెప్పాడట. పవన్‌ 2014లో జనసేన పెట్టిన వెంటనే శ్రీహరి నాను అనే రచయిత పవన్‌ రాజకీయాలలోకి వస్తే ఎలా ఉంటుంది? నిజంగా రాజకీయాలు ఎలా ఉండాలి? ముఖ్యమంత్రి ఎలా ఉండాలి? అనేది చెబుతూ కథను రాసి పవన్‌కి వినిపించడం కూడా జరిగిందట. ఈ స్టోరీ చాలా బాగుందని మెచ్చుకుంటూనే తాను ఇప్పుడు ఈ చిత్రం చేయలేనని పవన్‌ తప్పుకున్నాడట. దాంతో సాధారణంగా తన సినిమాలకు తానే కథ రాసుకునే కొరటాల శివ ఎక్కడి నుంచో కాపీ కొట్టాడనే విమర్శలు 'శ్రీమంతుడు'కి వచ్చిన నేపధ్యంలో శ్రీహరి నానుకి కోటి రూపాయలు చెల్లించి, ఆ కథను తాను తీసుకుని తదనుగుణంగా మహేష్‌ని ఒప్పించి, అందులో మార్పులు చేర్పులు చేశాడని తెలుస్తోంది. అలా 'పోకిరి, అతడు' తరహాలో పవన్‌ చేయాల్సిన 'భరత్‌ అనే నేను' చిత్రం ద్వారా పవన్‌ ముఖ్యమంత్రిగా కనిపించకుండా పోయేసరికి మహేష్‌ సీఎం అయ్యాడని శ్రీహరి నాను చెబుతున్నాడు.

Bharath Ane Nenu Movie Story for Pawan Kalyan:

Bharat Ane Nenu Is Written By Pawan Kalyan - Story Writer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs